Site icon NTV Telugu

Bangladesh: ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టినందుకు హిందువు ఇళ్లు దహనం

Bangladesh

Bangladesh

Hindu man’s home set on fire in Bangladesh: బంగ్లాదేశ్ లో మతోన్మాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇప్పటికే ఆ దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువులు మతపరమైన వివక్ష ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఉండే కొంతమంది మతోన్మాదులు హిందువుల పండగల సందర్భంలో, ఉత్సవాల సందర్భంలో గుడులపై దాడులు చేయడం, హిందువుల ఇళ్లపై దాడులకు తెగబడుతున్నారు.

తాజాగా బంగ్లాదేశ్ లో మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. ఇస్లాంను కించపరుస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడని ఆరోపిస్తూ..బంగ్లాదేశ్ లోని నరైల్ లోని లోహగరాలోని హిందు వ్యక్తి ఇంటికి నిప్పు పెట్టడమే కాకుండా.. దేవాలయానికి దుండగులు శుక్రవారం నిప్పు పెట్టారు. ఈ ఘటనల తరువాత అల్లరి మూక రాళ్లు రువ్వింది. స్థానికంగా ఉండే డిఘోలియా గ్రామంలో కూడా అల్లర్లు చెలరేగాయి. అల్లరి మూకలు గ్రామంలో అనేక ఇళ్లను ధ్వంసం చేశారు.. ఇళ్లను కాల్చేందుకు ప్రయత్నించారు. అయితే అల్లరి మూకను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

Read Also: Uttar Pradesh: దేవాలయంలో మాంసం ముక్కలు.. కన్నౌజ్ లో మతఘర్షణలు

సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ముస్లింలు ఈ దాడికి పాల్పడ్డారు. అయితే పోస్ట్ పెట్టిన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. యువకుడి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే దాడికి పాల్పడిన వారిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేయనట్లుగా తెలుస్తోంది. నారైల్ ఎస్పీ ప్రబీర్ కుమార్ రాయ్ మాట్లాడుతూ.. పరిస్థితి అదుపులో ఉందని.. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తామని అన్నారు. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వ్యక్తిని స్థానిక హిందూ యువకుడు సహపరా ప్రాంతానికి చెందిన అశోఖ్ సాహా కుమారుడు ఆకాష్ సాహాగా గుర్తించారు. శుక్రవారం జుమా ప్రార్థనలు ముగిసిన తర్వాత ఈ హింస చోటు చేసుకుంది.

బంగ్లాదేశ్ లో మతపరంగా మైనారిటీలు అయిన హిందువులపై తరుచుగా దాడులు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టుల కన్నా వదంతుల వల్లే ఎక్కువగా దాడులు జరుగుతన్నాయి. ఓ నివేదిక ప్రకారం జనవరి 2013 మరియు సెప్టెంబర్ 2021 మధ్య బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై 3,679 దాడులు జరిగాయి.

Exit mobile version