NTV Telugu Site icon

Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రసంగాలపై నిషేధం..

Hasena

Hasena

Sheikh Hasina: మాజీ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా ప్రసంగాలు ప్రసారం కాకుండా బంగ్లాదేశ్‌ ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రిబ్యునల్ నిషేధం విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, గత ఆగస్టులో దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో వందల మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హసీనా ప్రసంగం వల్ల సామాన్యులు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని.. ఫలితంగా దేశంలో మరోసారి అల్లర్లు చెలరేగే ఛాన్స్ ఉందని ట్రిబ్యునల్ ఈ నిర్ణయం తీసుకుంది.

Read Also: Drug Enforcement in Hyd: తండ్రి బియ్యం వ్యాపారి.. కొడుకు డ్రగ్స్ వ్యాపారి..

కాగా, బంగ్లాదేశ్ లో అల్లర్ల నేపథ్యంలో భారతదేశంలో తలదాచుకుంటుంది. చివరి సారిగా న్యూయార్క్‌లోని తన మద్దతుదారులను ఉద్దేశించి.. ఆమె ప్రసంగించారు. ఆ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఐసీటీ.. హసీనా ప్రసంగాలు న్యాయపరమైన చర్యలకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది.. సాక్షులను, బాధితులను బెదిరించే ఛాన్స్ ఉందని పేర్కొనింది. ఇక, ఆమె విద్వేషపూరిత ప్రసంగాలను ప్రసారం చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.

Read Also: Afghanistan: మహిళలకు వైద్య విద్యను నిషేధించిన తాలిబాన్..! తప్పుపట్టిన క్రికెటర్లు

అయితే,1971లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య ఉద్యమంలో జరిగిన దురాగతాలను విచారణ చేసేందుకు 2010లో మాజీ ప్రధాని షేక్ హసీనా ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేసింది. దీన్ని అనుకూలంగా చేసుకుని తన ప్రత్యర్థులైన పలువురు రాజకీయ నాయకులకు మరణ శిక్ష పడేలా హసీనా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

Show comments