Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌లో తాలిబాన్‌లు.. బయటపడ్డ పాకిస్తాన్ మూలాలు..
- బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌లో తాలిబాన్లు..
- దేశవ్యాప్తంగా ఉన్నతాధికారుల దాడులు..
- పలువురు ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది అరెస్ట్..
- మరికొందరు విదేశాలకు పరారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్‌లో పాకిస్తాన్ మూలాలు బయటపడ్డాయి. నిషేధిత పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ తెహ్రిక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (TTP)తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ, బంగ్లాదేశ్‌లోని పలు వైమానిక స్థావరాలపై ఉన్నతాధికారులు దాడులు చేశారు. ఈ నెట్వర్క్ బయటపడటంతో భారీ ఎత్తున ప్రక్షాళనకు బంగ్లాదేశ్ పూనుకుంది. ఏప్రిల్ 20 తెల్లవారుజామున జరిగిన ఈ ఆపరేషన్‌లో ఇద్దరు స్వ్కాడ్రన్ లీడర్లు, దాదాపు 10 మంది జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు(JCOలు), వైమానిక సిబ్బంది అరెస్టులు జరిగాయి. మరో 12 మందిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ఇంకా చాలా మంది దేశం విడిచిపెట్టి విదేశాలకు వెళ్లిపోయారు.
Read Also: PM Modi: మే 4 తర్వాత బెంగాల్‌లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
Also Read
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
నివేదికల ప్రకారం.. ఏప్రిల్ 20రన ఢాకాలోని రెండు ఎయిర్ బేస్‌లపై బంగ్లా ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు చేశారు. చిట్టగాంగ్ లోని జహరుల్ హక్ ఎయిర్ బేస్‌లో పనిచేస్తున్న వైమానిక దళ వారెంట్ ఆఫీసర్ సెలవు లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. దీని తర్వాత పాకిస్తానీ అధికారులు ఇతడిని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పట్టుకున్నారు. పాకిస్తాన్ అధికారుల సహకారంతో ఈ అరెస్ట్ జరిగింది. ఇతడికి, పాక్ తాలిబాన్లతో సంబంధం ఉన్నట్లుగా తేలింది. బంగ్లా ఎయిర్‌ఫోర్స్‌లో తాలిబాన్‌కు సంబంధించి ఎవరున్నారనే వివరాలను కూడా బయటపెట్టాడు.
చిట్టగాంగ్‌లోని జహూరుల్ హక్ ఎయిర్ బేస్, ఢాకాలోని కుర్మిటోలాలో ఉన్న ఏ కే ఖండకర్ బేస్, జెస్సోర్‌లోని మతియుర్ రెహమాన్ బేస్ అనే మూడు కీలక స్థావరాలపై ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల పాటు దాడులు జరిగాయి. హూరుల్ హక్ ఎయిర్ బేస్‌లోని ప్రధాన మసీదు ఇమామ్ అయిన అబ్దుస్ షుకూర్‌ను, టీటీపీకి చెందిన ప్రధాన రిక్రూటర్‌గా దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే, ఈ నెట్వర్క్‌తో సంబంధాలు ఉన్న అధికారులు అరెస్టుల భయంతో టర్కీ, పాకిస్తాన్, న్యూజిలాండ్, పోర్చుగల్ పారిపోయారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!