NTV Telugu Site icon

Pakistan: పాక్ ఆర్మీని చావు దెబ్బతీసిన బీఎల్ఏ.. 90 మంది మృతి..

Bla

Bla

Pakistan: పాకిస్తాన్‌ సైన్యానికి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే ట్రైన్ హైజాక్‌తో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సవాల్ చేసింది. బెలూచిస్తాన్‌ని విముక్తి చేసేందుకు సాయుధ పోరాటం చేస్తున్న బీఎల్ఏ పాక్ ఆర్మీని ముప్పుతిప్పలు పెడుతోంది. నిజానికి బలూచ్ ప్రావిన్సులో కొన్ని ప్రాంతాల్లో తప్పితే, మరే ప్రాంతానికి కూడా పాక్ అధికారులు, సైన్యం వెళ్లలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే జఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ ఘటనలో, బీఎల్ఏ డిమాండ్లకు పాక్ ప్రభుత్వం తలొగ్గకపోవడంతో 200 మందికి పైగా ఆర్మీ సిబ్బందిని చింపేసినట్లు బీఎల్ఏ ప్రకటించింది.

Read Also: CNG cars: ప్రీమియం ఫీచర్లు.. మైలేజీలో తోపు.. టాప్ వేరియంట్ CNG కార్లు ఇవే

ఇదెలా ఉంటే, తాజాగా క్వెట్టా నుంచి టఫ్తాన్ వెళ్తున్న పాకిస్తాన్ సైనికులు కాన్వాయ్‌పై జరిగిన దాడిలో కనీసం ఏడుగురు సైనికులు మరణించగా, 21 మంది గాయపడినట్లు అధికార వర్గాలు చెప్పాయి. అయితే, బీఎల్ఏ ఈ దాడికి బాధ్యత వహించినట్లు పేర్కొంది. 90 మంది సైనిక సిబ్బంది మరణించినట్లు చెప్పింది. ఏడు బస్సులు, రెండు వాహనాలతో కూడిన కాన్వాయ్‌పై బీఏల్ఏ ఐఈడీ బాంబులు, ఆర్‌పీజీలతో దాడులు చేసింది. కాన్వాయ్‌ని చుట్టుముట్టి దాడులు నిర్వహించింది.

ఈ ఘటన తర్వాత గాయపడిన వారిని తరలించడానికి ఆర్మీ హెలికాప్టర్లను మోహరించింది. ఈ ప్రాంతంలో నిఘా కోసం డ్రోన్లను ఉపయోగిస్తోంది. ‘‘ఆదివారం బీఎల్ఏ చేసిన దాడిలో, బీఎల్ఏకి చెందిన ఫిరాయి యూనిట్ అయిన మజీద్ బ్రిగేడ్, కొన్ని గంటల క్రితం నోష్కిలోని ఆర్సీడీ హైవేపై రక్షన్ మిల్ సమీపంలో జరిగిన దాడిలో ఆక్రమిత పాకిస్తాన్ మిలిటరీ కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకున్నాము. కాన్వాయ్‌లో 8 బస్సులు ఉన్నాయి. వాటిలో ఒకటి పేలుడు ధాడికి పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడిలో 90 మంది పాక్ సైనిక సిబ్బంది మరణించారు’’ అని బీఎల్ఏ ఒక ప్రకటనలో పేర్కొంది. దాడి జరిగిన వెంటనే బీఎల్ఏకి చెందిన ఫతే స్క్వాడ్ మరో బస్సుని చుట్టుముట్టింది. అందులో ఉన్న సైనిక సిబ్బందిని క్రమపద్ధతిలో తొలగించింది. మొత్తం శత్రువుల మరణాలు(పాక్ ఆర్మీ సిబ్బంది) 90కి చేరుకున్నట్లు చెప్పింది.