NTV Telugu Site icon

Iran: ఇజ్రాయెల్‌పై యుద్ధం విషయంలో వెనక్కి తగ్గేదేలేదు.. ఇరాన్ ప్రకటన

Ayatollahkhamenei

Ayatollahkhamenei

ఇజ్రాయెల్‌పై యుద్ధం విషయంలో ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్‌ విషయంలో వెనక్కి తగ్గితే.. దైవాగ్రహం తప్పదని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయాతొల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించారు. ప్రతీకారం విషయంలో వెనక్కి తగ్గినా.. రాజీపడినా దైవాగ్రహానికి గురికాక తప్పదని ఇరానీయులకు హెచ్చరికలు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: Live Location: మహిళ హత్య కేసులో పోలీసులకు సాయపడిన ‘‘లైవ్ లొకేషన్’’.. ఏం జరిగిందంటే..

ఇరాన్‌లో హమాస్ అగ్ర నేత హనియే హత్యకు గురైన తర్వాత ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. ఏ క్షణంలోనైనా ఇరాన్ దాడి చేయొచ్చని అమెరికా ఇప్పటికే వెల్లడించింది. ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉండాలని.. తాము అండగా ఉంటామని అమెరికా వెల్లడించింది. అయితే ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకొనే విషయంలో ఇరాన్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసిందన్న వార్తలు వస్తున్నవేళ ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిరేపుతోంది.

ఇది కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రోడ్లు జలమయం

ఇజ్రాయెల్‌పై దాడి విషయంలో ఇరాన్‌ పునరాలోచించేలా శత్రువు మానసిక యుద్ధం చేస్తున్నారని ఖమేనీ పేర్కొన్నారు. రాజకీయ, సైనిక, ఆర్థిక విషయాల్లో కానీ ఏమాత్రం వెనక్కి తగ్గినా దేవుడి నుంచి శిక్ష తప్పించుకోలేరని పేర్కొన్నారు. శత్రువు బలాన్ని అతిగా ఊహించుకోవడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. 1979 నుంచి అమెరికా, బ్రిటన్‌, ఇజ్రాయెల్‌ కలిసి ఇరాన్‌ను దెబ్బతీయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాయన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌ మాత్రం టెహ్రాన్‌ నుంచి ఏదైనా దుందుడుకు చర్యకు పాల్పడితే.. కచ్చితంగా బలమైన ప్రతిస్పందనను చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించింది.

గత నెలలో హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియే హత్యకు గురయ్యారు. ఇరాన్‌ నూతన అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న అనంతరం ఓ అతిథిగృహంలో ఆయన విశ్రాంతి తీసుకొన్న వేళ హతమయ్యాడు. ఈ దాడిలో ఆయనతోపాటు ఒక బాడీగార్డ్‌ కూడా ప్రాణాలు కోల్పోయాడు.

ఇది కూడా చదవండి: Russia: డ్యాన్సర్‌కు రష్యా కఠిన శిక్ష.. ఉక్రెయిన్‌కు విరాళం ఇచ్చినందుకు 12 ఏళ్లు జైలు