NTV Telugu Site icon

Australia: ఆస్ట్రేలియాలో దారుణం.. మహిళా ఎంపీకి డ్రగ్స్ ఇచ్చి లైంగిక వేధింపులు..

Mp Brittany Lauga

Mp Brittany Lauga

Australia: ఆస్ట్రేలియాలో దారుణం చోటు చేసుకుంది. క్వీన్స్ లాండ్ ఎంపీగా ఉన్న బ్రిటనీ లాగా(37)కి డ్రగ్స్ ఇచ్చి, లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. తన నియోజకవర్గం యెప్పూన్‌లో సాయంత్రం సమయంలో బయట దాడికి గురయ్యానని చెప్పారు. ఇది ఎవరికైనా జరిగి ఉండొచ్చు, ఇది విషాదకరం, ఇది మనలో చాలా మందికి జరుగుతుంది అని పోస్ట్‌లో పేర్కొన్నారు. గత వారాంతంలో నైట్ అవుట్‌లో తనకు మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించారని క్వీన్స్ లాండ్ లేబర్ పార్టీ ఎంపీ బ్రిటీనీ లాగా చేసిన ఆరోపణలపై ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: Bengaluru: కాంగ్రెస్ నేతను కొట్టిన డీకే.శివకుమార్.. వీడియో వైరల్

ఇటీవల ఈ ప్రాంతంలో ఇతర మహిళలపై కూడా ఇలాగే లైంగికదాడికి పాల్పడ్డారని చెప్పడం మరింత ఆందోళనకరంగా మారింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఏప్రిల్ 28న ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి పరీక్షల్లో తన శరీరంలో, తాను తీసుకొని డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారించారని ఆమె చెప్పింది. ఆ పదార్థం తనపై గణనీయంగా ప్రభావం చూపించిందని, ఇతర మహిళలు కూడా తనను సంప్రదించి తమ దుస్థితిని పంచుకున్నారని ఆమె చెప్పింది. లాగా దాదాపుగా ఒక దశాబ్ధంగా పార్లమెంట్ సభ్యురాలిగి ఉన్నారు, ఆమె మొదటిసారిగా 2015లో కెప్పెల్ స్థానానికి ఎన్నికయ్యారు.

ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్న క్వీన్స్ లాండ్ పోలీసులు ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇతర నివేదికలు ఏమీ లేవని, ఎవరికైనా సమాచారం ఉంటే తమను సంప్రదించాలని కోరారు. క్వీన్స్‌లాండ్ హౌసింగ్ మంత్రి మేఘన్ స్కాన్లాన్ ఆరోపణలను షాకింగ్, భయంకరమైనవిగా పేర్కొన్నారు. ఇటీవల కొన్ని రోజులుగా ఆస్ట్రేలియాలో అత్యధికంగా లింగ-ఆధారిత హింస చోటు చేసుకుంది. ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ కూడా గృహ హింసను “జాతీయ సంక్షోభం”గా అభివర్ణించారు. స్త్రీద్వేషపూరిత ఆన్‌లైన్ కంటెంట్‌పై కఠినంగా వ్యవహరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.