Australian Man Break Guinness World Record For Most Pubs Visited In 24 Hours: 24 గంటల్లోనే అత్యధిక పబ్ అండ్ బార్లను సందర్శించిన వ్యక్తిగా ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ నగరానికి చెందిన దక్షిణాఫ్రికా వ్యక్తి రికార్డ్ సృష్టించాడు. అతి తక్కువ సమయంలోనే రికార్డు స్థాయిలో బార్లకు వెళ్లాడు. అంతకు ముందు ఓ ఇంగ్లాండ్ వ్యక్తి పేరుపై ఉన్న రికార్డును తిరగరాశాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరును లిఖించుకున్నారు. ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌కు చెందిన దక్షిణాఫ్రికా వ్యక్తి ఈ రికార్డును నెలకొల్పాడు. 24 గంటల్లో వేరు వేరు చోట్ల ఉన్న 78 పబ్ లను సందర్శించాడు. హెన్రిచ్ డివిలియర్స్ ఫిబ్రవరి 10-11 తేదీల్లో ఈ రికార్డును క్రియేట్ చేశాడు. హెన్రిక్ తన ఇద్దరు స్నేహితులు రువాల్డ్ డి విలియర్స్, వెసెల్ బర్గర్ లతో కలిసి ఈ ఫీట్ లో పాల్గొన్నాడు.
Read Also: Twitter: పెప్సీ ట్విట్టర్ ఖాతా నుంచి “కోక్ ఈజ్ బెటర్” అంటూ ట్వీట్ .. కొత్త పాలసీతో చిక్కులు
కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తీవ్రంగా ప్రభావితం అయిన పబ్, బార్లను దృష్టిలో పెట్టుకుని.. అలాగే మెల్బోర్న్ నగరంలో అంతగా తెలియని ప్రదేశాలను బయటకు తీసుకురావడానికి, వారికి మద్దతు ఇవ్వడానికి ఈ ఛాలెంజ్ తీసుకున్నట్లు హెన్రిక్ డివిల్లియర్స్ చెప్పాడు. నవంబర్ 2021లో మెల్బోర్న్ అప్పుడప్పుడే కోవిడ్ లాక్ డౌన్ నుంచి బయటపడుతున్న సమయంలో మొదటిసారిగా రికార్డ్ నెలకొల్పేందుకు దరఖాస్తు చేశానని చెప్పాడు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నిబంధనల ప్రకారం..మేము సందర్శించిన ప్రతీ ప్రదేశంలో 125 మిల్లీలీటర్ల డ్రింక్ తీసుకోవాల్సి ఉంటుందని డివిలియర్స్ వెల్లడించాడు. ఈ రికార్డ్ కోసం మెల్బోర్న్ లోని అన్ని బార్ లపై పరిశోధన చేశామని.. రికార్డు నెలకొల్పుతున్న సమయంలో సాక్ష్యాలను రికార్డ్ చేసుకునేందుకు అన్నింటిని సిద్ధం చేసుకుని.. ముందుగానే ఓ మార్గాన్ని ప్లాన్ చేసుకున్నట్లు వెల్లడించాడు. ఒక రోజు వ్యవధిలో 78 పబ్ లను సందర్శించారు. అంతకుముందు ఈ రికార్డ్ ఇంగ్లాండ్ కు చెందిన నాథన్ క్రింప్ అనే వ్యక్తి పేరు మీద ఉండేది. అతను ఇంగ్లాండ్ లోని బ్రైటన్ లోని 67 పబ్‌లను 24 గంటల్లో సందర్శించాడు.
