NTV Telugu Site icon

China: కిండర్‌గార్టెన్‌పై యువకుడి దాడి.. కత్తిపోట్లతో ఆరుగురు మృతి

China

China

China: చైనాలో కిండర్‌గార్టెన్‌పై ఆగంతక యువకుడు దాడికి పాల్పడ్డాడు. ఆగంతకుడు కత్తితో దాడి చేయడంతో ఆరుగురు మృతి చెందారు. చైనాలోని గువాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని లియాన్‌జియాంగ్‌ కౌంటీలో కిండర్‌గార్టెన్‌లోకి చొరబడిన ఓ 25 ఏండ్ల వ్యక్తి.. అందులో ఉన్నవారిపై పదునైన ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు. ఆగంతుకుడి దాడిలో ఆరుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానితుడిని అరెస్టు చేశారు.

Read also: MS Dhoni Run-Out: కోట్లాది మంది భారతీయులు హర్ట్.. విలన్ మార్టిన్ గప్టిల్! వీడియో వైరల్

దాడికి పాల్పడిన యువకుడు లియాన్‌జియాంగ్‌కు చెందినవాడిగా గుర్తించారు. అతడు ఊ అనే ఇంటి పేరు కలిగి ఉన్నాడని తెలిపారు. అయితే అతడు కిండర్‌గార్టెన్‌పై ఎందుకు దాడిచేశాడనే కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడు తమ అదుపులోనే ఉన్నాడని.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన చర్చ సోషల్‌ మీడియాలో టాప్‌ ట్రెండింగ్‌లో ఉన్నది. ఇప్పటివరకు 130 మిలియన్ల మంది దీనిని వీక్షించారు. బాధితుల్లో పెద్దలు, పిల్లలు కూడా ఉన్నారని మీడియా పేర్కొంది. చైనాలో కఠినమైన తుపాకీ చట్టాలు మరియు కట్టుదిట్టమైన భద్రత కారణంగా హింసాత్మక నేరాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ప్రీ-స్కూల్‌లలో అనేక కత్తిపోట్లు సంఘటనలు జరిగాయి. గత ఏడాది ఆగస్టులో జియాంగ్జి ప్రావిన్స్‌లోని కిండర్ గార్టెన్‌లో జరిగిన కత్తిపోట్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. 2021లో గ్వాంగ్జీలోని నైరుతి ప్రాంతంలోని కిండర్ గార్టెన్‌లో ఒక వ్యక్తి ఇద్దరు పిల్లలను చంపి 16 మందిని గాయపరిచాడు. సోషల్ మీడియాలో కొంత మంది నెట్‌ జన్లు నిందితుడికి మరణశిక్ష విధించాలని కోరుతున్నారు.

Show comments