South Korea: సౌత్ కొరియాలో ఘోర విమాన ప్రమాదం.. 28 మంది మృతి

  • సౌత్ కొరియాలో మరో విమాన ప్రమాదం..,
  • 28 మంది మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు..
  • ముయాన్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సమయంలో ప్రమాదం..
South Korea

South Korea

South Korea: సౌత్ కొరియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ముయూన్‌ ఎయిర్‌పోర్టు రన్‌వేపై విమానం అదుపు తప్పి పక్కనే ఉన్న రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగి విమానం ఒక్కసారిగా పేలిపోయింది. అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారని సమాచారం. కాగా, ఇప్పటి వరకు 28 మంది మరణించగా.. మరో 23 మందికి గాయాలు అయినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. బ్యాంకాక్‌ నుంచి ముయూన్‌కు వెళ్తుండగా ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.