Site icon NTV Telugu

Pakistan: పాక్ మళ్లీ వక్రబుద్ధి.. కాశ్మీర్‌పై ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Pakarmy

Pakarmy

కాశ్మీర్‌పై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అసిమ్ మునీర్ కాశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. కాశ్మీర్ తమ జీవనాడి అని.. దానిని మరిచిపోలేమని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Robert Vadra: ఈడీ ప్రశ్నలపై రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు

విదేశాల్లో ఉన్నవారంతా దేశ రాయబారులు అని.. ఉన్నతమైన భావజాలం.. సంస్కృతికి చెందినవారన్న విషయాన్ని మరిచిపోకూడదని హితవు పలికారు. మీ పిల్లలకు మన దేశ చరిత్రను తెలియజేయాలని.. హిందువులతో పోలిస్తే.. మనం భిన్నమైన వారమని బోధించాలని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆశయాలు భిన్నం అని చెప్పారు. దేశం ఏర్పాటు కోసం మన పూర్వీకులు ఎంతగానో పోరాటం చేశారని తెలిపారు. ఈ స్టోరీని మీ పిల్లలకు తెలియజేయాలని అసిమ్ మునీర్ కోరారు.

‘‘నా ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, కుమార్తెలు, కుమారులారా దయచేసి పాకిస్తాన్ కథను మర్చిపోకండి. పాకిస్తాన్‌తో వారి బంధం ఎప్పటికీ బలహీనపడకుండా ఈ కథను మీ తర్వాత తరానికి చెప్పడం మర్చిపోవద్దు’’. అని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి: Abhinaya : ముడు ముళ్ళ బంధంతో ఒక్కటైన అభిన‌య..కార్తీక్

Exit mobile version