NTV Telugu Site icon

Trump Zelensky: ట్రంప్, జెలెన్ స్కీ మధ్య వాగ్వాదం.. వైట్‌హౌజ్ సమావేశంలో రచ్చ..

Trump Zelensky

Trump Zelensky

Trump Zelensky: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అమెరికాతో ఉక్రెయిన్ మినరల్ డీల్‌లో భాగంగా జెలెన్స్కీ వైట్‌హౌజ్ వెళ్లారు. ఇరువురు నేతలు సమావేశమైన సమయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ట్రంప్ బిగ్గరగా మాట్లాడుతూ.. ‘‘మీరు ఒక ఒప్పందం కుదుర్చుకోండి. లేదంటే మేము బయటకు వెళ్లిపోతాం’’ అని అన్నారు. ‘‘నువ్వు పెద్ద ఇబ్బందుల్లో ఉన్నాము. నీవు ఇందులో గెలవలేకపోతున్నాము’’ అని ట్రంప్ అన్నారు.

దీనికి జెలెన్స్కీ స్పందిస్తూ.. ‘‘ మేము మా సొంత దేశంలో ఉన్నాము, మేము ఈ సమయంలో బలంగా ఉన్నాము. దానికి మీ మద్దతుకు మీకు కృతజ్ఞతలు కూడా చెప్పాము’’ అని అన్నారు. అంతర్జాతీయ మీడియా ముందే ఇద్దరు నేతలు అరుచు కోవడం సంచలనంగా మారింది. ఉక్రెయిన్‌లో శాంతి ఒప్పందంపై ఆశలు అయోమయంలో పడుతున్న సమయంలో, ‘‘ఈ విధంగా వ్యవహరించడం వల్ల పరిస్థితులు చాలా కష్టమవుతాయని నేను భయపడుతున్నాను’’ అని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ‘‘మీరు లక్షలాది మంది జీవితాలతో జూదం ఆడుతున్నారు. మీరు మూడో ప్రపంచ యుద్ధంతో ఆటలాడుతున్నారు. మీరు చేస్తున్నది ఈ దేశానికి అగౌరవంగా ఉంది’’ అని ట్రంప్ ఒకింత ఘాటుగానే అన్నారు.

Read Also: Tech Tips: ఫోన్‌లో ఇన్​కాగ్నిటో ట్యాబ్ లాక్ చేయాలనుకుంటున్నారా?.. ఇలా చేయండి!

ఆ తర్వాత జెలెన్స్కీని ఉద్దేశిస్తూ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా కఠినంగా మాట్లాడారు. యుద్ధాన్ని ముగించేందుకు దౌత్యం అవసరమని చెప్పారు. దీనికి ప్రతిగా ‘‘ఎలాంటి దౌత్యం’’ అని జెలెన్స్కీ ఎదురు ప్రశ్నించారు. జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడి ఓవర్ కార్యాలయంలో అగౌరవంగా ప్రవర్తించారని జేడీ వాన్స్ నిందించారు. ‘‘మీ దగ్గర మా సైనిక పరికరాలు లేకపోతే యుద్ధం రెండు వారాల్లో ముగిసేది’’ అని ట్రంప్ అన్నారు. అయితే దీనికి సమాధానంగా జెలెన్స్కీ ‘‘నేను పుతిన్ నుంచి దీనిని విన్నారు, 3 రోజుల్లో’’ అని స్పందించారు.

డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీపై మరింతగా విమర్శించారు. ‘‘మీకు మేము 350 బిలియన్ డాలర్లు ఇచ్చాము.’’ అని చెప్పారు. కీలమైన ఖనిజాల ఒప్పందం జారిపోయే అవకాశం ఉంటడంతో, ట్రంప్ మాట్లాడుతూ.. ఇలాగైతే వ్యాపారం చేయడం చాలా కష్టమవుతుందని అని అన్నారు. జెలెన్స్కీపై ఆగ్రహంతో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘”ప్రజలు చనిపోతున్నారు, మీ దగ్గర సైనికులు తక్కువగా ఉన్నారు, ఆపై మీరు ‘నాకు కాల్పుల విరమణ వద్దు’ , ‘నేను పోరాటం కొనసాగించాలనుకుంటున్నాను’ అని మాకు చెబుతున్నారు, చూడండి… మీరు ఇప్పుడే కాల్పుల విరమణకు పిలుపునివ్వాలి, యుద్ధం ఆగుతుంది, ఇక ప్రాణాలు కోల్పోవు. నాకు కాల్పుల విరమణ కావాలి, కానీ స్పష్టంగా మీరు కాల్పుల విరమణను కోరుకోవడం లేదు’’ అని అన్నారు.

కాల్పుల విరమణ గురించి మీకు ముందున్న వారు ఏమి చెప్పారో చూడండి అంటూ గత బైడెన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ జెలెన్స్కీ అన్నారు. దీనికి ట్రంప్ మాట్లాడుతూ.. బైడెన్ అనే వ్యక్తి తెలివైన వ్యక్తి కాదని అన్నారు. ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ మీ దగ్గర ఎలాంటి పాచికలు లేవు. మా దగ్గర ఉన్నాయి.’’ అని వాదనల్ని ముగించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ట్రంప్.. ‘‘ అమెరికా పాల్గొంటే అధ్యక్షుడు జెలెన్క్సీ శాంతి సిద్ధంగా లేరని నేను నిర్ధారించాను’’ అని చెప్పారు.