NTV Telugu Site icon

Canada: కెనడా చరిత్రలోనే అతిపెద్ద బంగారం దోపిడి కేసులో మరో భారత సంతతి వ్యక్తి అరెస్ట్..

Canada

Canada

Canada: కెనడా దేశ చరిత్రలోనే అతిపెద్ద దోపిడి కేసులో మరో భారతీయ సంతతి వ్యక్తిని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. టొరంటోలోని ప్రధాన విమానాశ్రయం నుంచి 36 ఏళ్ల వ్యక్తిని పోలసులు అదుపులోకి తీసుకున్నారు. నెల రోజుల క్రితం ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసిన తర్వాత, ఈ అరెస్ట్ చోటు చేసుకుంది. ఏప్రిల్ 17, 2023న ఎయిర్ కార్గో కంటైనర్ తీసుకెళ్తున్న 22 మిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన బంగారాన్ని, విదేశీ కరెన్సీని దోపిడి చేశారు. వీటిని సురక్షితమైన ఫెసిలిటీ నుంచి నకిలీ పేపర్లు ఉపయోగించి దోపిడీకి పాల్పడ్డారు.

స్విట్జర్లాండ్ జూరిచ్ నుంచి టొరంటోలోని పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ఎయిర్ కెనడా విమానంలో బంగారం, కరెన్సీ వచ్చాయి. ఫ్లైట్ ల్యాండ్ అయిన కొద్ది సేపటికి కార్గోని బయటకు తీసుకువచ్చారు. ఆ తర్వాత దీనిని ప్రత్యేక ప్రదేశానికి తరలించారు. అయితే, ఒక రోజు తర్వాత అవి కనిపించకుండా పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read Also: Rahul Gandhi : నేడు రాయ్ బరేలీలో రాహుల్ ప్రచారం.. ఇందిరా నుంచి సోనియా వరకు వ్యూహం ఇదే

మే 6, 2024లో ఈ కేసులో అర్చిత్ గ్రోవర్‌ని అధికారులు అరెస్ట్ చేశారు. అతడిని అరెస్ట్ చేయడానికి కెనడా వ్యాప్తంగా పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఇతడిపై దొంగతనం, ఇతర అభియోగాలను మోపారు. గత నెలలో ఈ కేసులు అంటారియోకు చెందిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులు పర్మ్పాల్ సిద్ధు(54), అమిత్ జలోటా(40), అమ్మద్ చౌదరి(43), అలీ రజా(37), ప్రసాత్ పరమలింగం(35) లను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా దొంగతనం జరిగిన సమయంలో ఎయిర్ కెనడా ఉద్యోగి, బ్రాంప్టన్‌కి చెందిన సిమ్రాన్ ప్రీత్ పనేసర్(31), మిస్సాసాగాకు చెందిన 42 ఏళ్ల అర్సాలాన్ చౌదరి కోసం కెనడా వ్యాప్తంగా వారెంట్లు జారీ చేశారు. వీరిలో ఒకరు పోలీసులకు చిక్కగా, మరొకరిపై వారెంట్ జారీ చేసింది. ఈ ఇద్దరు మాజీ ఎయిర్ కెనడా ఉద్యోగులు దొంగతనంలో సాయపడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దొంగిలించిన సరుకులో 400 కిలోల బరువున్న స్వచ్ఛమైన 6600 బంగారం కడ్డీలు ఉన్నాయి. వీటి విలువ 20 మిలియన్ కెనడియన్ డాలర్లు. 2.5 మిలియన్ డాలర్ల విలువైన విదేశీ కరెన్సీ ఉంది.