Anil Kochhar: అమెరికా యూనివర్శిటీలో సంచలనం.. 176 మంది స్టూడెంట్ లోన్స్ క్లియర్ చేసిన ఇండియన్! ఆయన ఎవరో తెలుసా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Kochhar: అమెరికాలోని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్శిటీలో జరిగిన స్నాతకోత్సవంలో విద్యార్థులకు స్వీట్ షాకింగ్ సర్ప్రైజ్ ఎదురైంది. భారత సంతతికి చెందిన అనిల్ కొచ్చర్ అనే దాత, ఆ విశ్వవిద్యాలయంలోని విల్సన్ కాలేజ్ ఆఫ్ టెక్స్టైల్స్కు చెందిన 176 మంది గ్రాడ్యుయేట్ల చివరి సంవత్సరం విద్యా రుణాలన్నింటినీ తానే తీర్చేస్తానని ప్రకటించారు. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. శుక్రవారం రెనాల్డ్స్ కొలీజియంలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ కొచ్చర్ 176 మంది గ్రాడ్యుయేట్ల స్టూడెంట్ లోన్స్ క్లియర్ చేస్తానని ప్రకటించారు.
తండ్రి జ్ఞాపకార్థం అపురూప కానుక
శుక్రవారం రెనాల్డ్స్ కొలీజియంలో జరిగిన స్నాతకోత్సవానికి కొచ్చర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల క్రితం పంజాబ్ నుంచి రాలీకి వచ్చిన తన దివంగత తండ్రి ప్రకాష్ చంద్ కొచ్చర్ ప్రస్థానాన్ని గౌరవించడానికే ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. “నా తండ్రి గౌరవార్థం, నేను – నా భార్య మార్లిన్ కొచ్చర్ కలిసి ఒక బహుమతిని విద్యార్థులకు ఇవ్వబోతున్నాం. 2025-26 విద్యా సంవత్సరంలో పట్టభద్రులైన విల్సన్ కాలేజీ విద్యార్థులందరి చివరి సంవత్సరం విద్యా రుణాలను మేమే చెల్లిస్తాం” అని అనిల్ కొచ్చర్ ప్రకటించగానే హాల్ మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది.
Also Read
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
ఎనిమిది దశాబ్దాల కిందటి ప్రయాణం..
అనిల్ కొచ్చర్ తన ప్రసంగంలో తన తండ్రి పంజాబ్ నుంచి అమెరికాకు చేసిన ప్రయాణాన్ని భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. 80 ఏళ్ల క్రితం పంజాబ్లో జన్మించిన ప్రకాష్ చంద్ కొచ్చర్ 1946లో కేవలం ఆశ, పట్టుదలతో వేల మైళ్లు ప్రయాణించి రాలీకి చేరుకున్నారని గుర్తు చేసుకున్నారు. చిన్నతనం నుంచే వస్త్ర పరిశ్రమపై ఆసక్తి ఉన్న ఆయన, 1950లో ఎన్.సి. స్టేట్ నుంచి డిగ్రీ, 1952లో మాస్టర్స్ పూర్తి చేశారని చెప్పారు. ఒకనాడు తన తండ్రికి స్వాగతం పలికిన ఆ యూనివర్సిటీలో, నేడు ఆయన కుమారుడిగా నిలబడి విద్యార్థులకు సహాయం చేయడం గర్వంగా ఉందని అనిల్ పేర్కొన్నారు. ఈ అసాధారణ విరాలంపై విల్సన్ కాలేజ్ డీన్ డేవిడ్ హింక్స్ స్పందిస్తూ.. కొచ్చర్ దంపతులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యాన్ని సాధించడంలో ఈ విరాళం ఎంతో సహాయపడుతుందని ఆయన కొనియాడారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు కొచ్చర్ దంపతులు విశ్వవిద్యాలయ సిబ్బందితో సంప్రదింపులు జరిపి, విద్యార్థులపై ఉన్న రుణ భారాన్ని తగ్గించేలా ప్రణాళిక రూపొందించారు. కేవలం పట్టా మాత్రమే కాకుండా, అప్పులు లేని భవిష్యత్తును బహుమతిగా పొందిన 176 మంది విద్యార్థులు కొచ్చర్ దంపతులకు గిఫ్ట్పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
IAS Officer Vikas Marmath: పబ్లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!