Site icon NTV Telugu

Amir Hamza: భారత్ శత్రువు లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జా హతం

Amirhamza

Amirhamza

భారతదేశ శత్రువు హతమయ్యాడు. లష్కరే తోయిబా సహ-వ్యవస్థాపకుడు అమీర్ హజ్జాపై కాల్పులు జరిగాయి. లాహోర్‌లో దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. గతంలో ఒకసారి ఇంట్లో పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా కాల్పులు జరగడంతో  హతమయ్యాడు.

అమీర్ హమ్జా..
అమీర్ హమ్జా పాకిస్థాన్‌కు చెందిన ఇస్లామిస్ట్. లష్కర్-ఎ-తోయిబా వ్యవస్థాపక నాయకుల్లో ఒకడు. హాఫిజ్ సయీద్ తర్వాత ఆ సంస్థకు రెండవ అత్యంత ముఖ్యమైన నాయకుడు ఇతడే. హాఫిజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడు. అమీర్ హమ్జా‌ను ట్రెజరీ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి, భారత్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ వంటి పలు దేశాలు కూడా ఉగ్రవాద సంస్థగా నిషేధించాయి.

ఈ సంస్థ పాకిస్థాన్ నిఘా సంస్థ (ISI) మద్దతుతో పనిచేస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో భారత్‌పై భారీ దాడులకు కుట్రలు పన్నింది. సరిహద్దుల ద్వారా ఉగ్రవాదులను పంపే ప్రయత్నాలు చేస్తోందని నివేదికలు తెలియజేస్తున్నాయి.

Exit mobile version