NTV Telugu Site icon

Russia- Ukraine Crisis: పెరుగుతున్న టెన్ష‌న్‌… బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైల్స్‌తో విన్యాసాలు…

ర‌ష్యా ఉక్రెయిన్ మ‌ధ్య టెన్ష‌న్ నానాటికి పెరిగిపోతున్న‌ది. స‌రిహ‌ద్ద‌లు నుంచి ర‌ష్యా ద‌ళాలు వెనక్కి వ‌చ్చాయ‌ని గ‌త రెండు రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ, స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌లు మాత్రం త‌గ్గ‌డం లేదు. స‌రిహ‌ద్దుల్లోని బ్లాక్ సీలో ర‌ష్యా యుద్ద‌విన్యాసాలు చేస్తున్న‌ది. బాలిస్టిక్‌, క్రూయిజ్ విస్సైల్స్‌తో విన్యాసాలు చేస్తున్న‌ది. దీంతో స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. న్యూక్లియ‌ర్ సామ‌ర్థ్యం క‌లిగిన బాలిస్టిక్‌, క్రూయిజ్ క్షిప‌ణుల‌ను విజ‌య‌వంతంగా ర‌ష్యా ప్ర‌యోగించింది.

Read: Devineni Uma: మంత్రి కొడాలి నానిపై విరుచుకుపడ్డ దేవినేని.. రేయ్ కొడాలి..!

మిస్సైల్స్ ప్ర‌యోగించ‌డంతో ఉక్రెయిన్‌తో పాటు, నాటో, అమెరికా దేశాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి. ర‌ష్యా పూర్తిస్థాయి యుద్ద స‌న్నాహాలు చేస్తున్న‌ది. టీయూ 95 బాంబ‌ర్స్‌, స‌బ్‌మెరైన్లు కూడా ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. యుద్ద రిహార్సిల్స్‌లో టార్గెట్‌ల‌ను చేధించామ‌ని ర‌ష్యా ర‌క్ష‌ణ‌శాఖ స్ప‌ష్టం చేసింది. ర‌ష్యా దూకుడుమీద ఉండ‌టంతో నాటో, అమెరికా దేశాలు ఆలోచ‌న‌లో ప‌డ్డాయి. ఒక‌వేళ యుద్దం త‌ప్ప‌నిస‌రైతే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో చ‌ర్చిస్తున్నాయి.