Site icon NTV Telugu

Bird Flu: అమెరికాలో కలకలం రేపుతున్న తొలి బర్డ్‌ ఫ్లూ మరణం..

Birdflue

Birdflue

Bird Flu: అమెరికాలో తొలి బర్డ్‌ ఫ్లూ మరణం తీవ్ర కలకలం రేపుతుంది. లూసియానాలో ఓ వ్యక్తికి బర్డ్‌ఫ్లూ సోకి చనిపోయినట్లు అక్కడి వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో పాటు పలు సమస్యలతో 65 ఏళ్ల వ్యక్తి ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు అక్కడి డాక్టర్లు పేర్కొన్నారు. అడవి పక్షులు, పెరటి మందకు దగ్గరగా వెళ్లడం వల్లే ఆ వ్యక్తికి హెచ్‌5ఎన్‌1 సోకిందని చెప్పుకొచ్చారు. అయితే, ఆ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్‌ వ్యాపించినట్లు ఎలాంటి ఆధారాలు ఇంకా లభించలేదని పేర్కొన్నారు.

Read Also: Harbhajan Singh: అతడు ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది కదా.. ఈ ఆరు నెలల్లో ఏమైంది?

అయితే, యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది ఏప్రిల్ నుంచి అమెరికాలో దాదాపు 70 మంది వ్యక్తులకు బర్డ్ ఫ్లూ సోకింది. వారిలో ఎక్కువ మంది వ్యవసాయ కార్మికులు, కోళ్ల ఫారాలు, పాడి పశువుల నుంచి ఈ వైరస్ వ్యాపించింది. అలాగే, 2022లో పౌల్ట్రీలో ప్రారంభమైన బర్డ్ ఫ్లూ వ్యాప్తి దాదాపు 130 మిలియన్ల అడవి, దేశీయ పౌల్ట్రీలకు వ్యాపించింది. దీని వల్ల 917 పాడి పశువులు అనారోగ్యానికి గురి అయ్యాయి. ఇక, లూసియానాలో మరణించిన రోగి నుంచి తీసుకున్న వైరస్ శాంపిల్స్ లో D1.1 జన్యు సంబందిత కారకంకు చెందినదిగా తేలింది. అదే రకం వైరల్ ఇటీవల వాషింగ్టన్ స్టేట్‌లోని అడవి పక్షులు, పౌల్ట్రీలో కనుగొనబడింది.

Exit mobile version