Site icon NTV Telugu

జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో కీలక తీర్పు…

అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్య పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  ఈ హత్య తరువాత దేశంలో ఉద్యమం జరిగింది. బ్లాక్ లైవ్ మ్యాటర్ పేరుతో పెద్ద ఎత్తున అమెరికాలో ప్రజలు ఉద్యమించారు.  లాఠీ ఛార్జ్, కాల్పులు జరిగాయి.  ఈ ఘటనకు కారణమైన పోలీస్ అధికారి డెరిక్ చౌవిక్ ను విధుల నుంచి తొలగించడమే కాకుండా, కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ కేసుకు సంబంధించి కీలక తీర్పును అమెరికా కోర్టు వెలువరించింది.  
12 మంది సభ్యులతో కూడిన జ్యూరీ 10 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది.  ఈ విచారణ అనంతరం కోర్టు కీలక తీర్పు వెలువరించింది.  జార్జ్ ఫ్లాయిడ్ మృతికి మిన్నియా పోలీస్ అధికారి డెరిక్ చౌవిక్ కారణమని తీర్పు ఇచ్చింది.  సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, నరమేధ హత్యగా దీనిని కోర్టు పేర్కొన్నది.  కోర్టు తీర్పు సమయంలో బయట పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.  తీర్పు అనంతరం ప్రజలు సంబరాలు చేసుకున్నారు.  

Exit mobile version