NTV Telugu Site icon

American Airlines plane: 172 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో మంటలు.. చివరకు

Us

Us

అమోరికాలో వరుస విమాన ప్రమాదాలు విమాన ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఫ్లైట్స్ కూలిపోవడం, మంటలు చెలరేగడం వంటి ఘటనలతో వణికిపోతున్నారు. తాజాగా యూఎస్ లో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 172 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విమానం రెక్కలపైకి చేరుకున్నారు. ఈ ప్రమాదం అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు చెలరేగిన తర్వాత భయానక వాతావరణం ఏర్పడింది.

Also Read:Trump: అమెరికన్ల మెడకు ఉచ్చుగా భారత్ పై ట్రంప్ విధించిన సుంకం.. ఎందుకంటే?

డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గేట్ C38 వద్ద నిలిపి ఉంచిన విమానంలో మంటలు చెలరేగాయి. టార్మాక్ పైకి దట్టమైన నల్లటి పొగ ఎగసిపడింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. మంటలు అదుపులోకి వచ్చాయని, ఎవరికీ గాయాలు కాలేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1006లో ఇంజిన్ సంబంధిత సమస్యలు తలెత్తాయి. దీనిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఆ ఫ్లైట్ లో ఉన్న 172 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది విమానం నుంచి దిగి టెర్మినల్‌కు వెళ్లారు.