Site icon NTV Telugu

Ukraine Crisis: రష్యా దాడికి ప్రతి చర్య తప్పదు: జో బైడెన్

ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు దిగడంపై అమెరికా స్పందించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఖండిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా అన్యాయంగా దాడి చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌లో జరిగే పరిణామాలకు రష్యా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ సార్వభౌమ‌త్వాన్ని ర‌ష్యా ఉల్లంఘించింద‌ని.. రష్యా సైనిక చ‌ర్యను ఆపాల‌ని, బ‌ల‌గాలు వెన‌క్కి వెళ్లిపోవాల‌ని ఆయన పేర్కొన్నారు.

రష్యా దాడులకు ప్రతి చర్య తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ఈ అంశంపై తాము తమ మిత్ర దేశాలతో కలిసి ఐకమత్యంతో నిర్ణయాత్మకంగా స్పందిస్తామ‌ని ప్రకటించారు. ముంద‌స్తు ప్రణాళిక ప్రకార‌మే పుతిన్ ఈ చ‌ర్యల‌కు పాల్పడుతున్నార‌ని విమర్శించారు. అటు పిచ్చుకపై బ్రహ్మాస్త్రం తరహాలో ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు పాల్పడుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో కేవలం రెండు గంటల్లోనే రష్యా బలగాలు మకాం వేశాయి. కీవ్ ఎయిర్‌పోర్టును స్వాధీనం చేసుకున్నాయి. కాగా ఉక్రెయిన్‌పై దాడులకు పాల్పడుతున్న ర‌ష్యాపై బ్రిట‌న్, ఆస్ట్రేలియా స‌హా ప‌లు దేశాలు మండిప‌డుతున్నాయి.

Exit mobile version