Site icon NTV Telugu

Iran-Israel War: ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులు ప్రయోగం.. టెల్ అవీవ్‌లో అమెరికా ఎంబసీకి నష్టం

Usisrael

Usisrael

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శుక్రవారం మొదలైన యుద్ధం తాజాగా భీకర స్థాయికి చేరింది. ఇరు దేశాలు నువ్వానేనా అన్నట్టుగా దాడులు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు కారణంగా టెల్ అవీవ్‌లో అమెరికా రాయబార కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది. దీంతో రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసేశారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్ వేదికగా అమెరికా ఎంబసీ తెలిపింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొంది. ఇరాన్ క్షిపణి తాకడంతో స్వల్పంగా ఎంబసీ ధ్వంసమైందని పేర్కొంది. ఇజ్రాయెల్‌లోని అమెరికా ఎంబసీ సోమవారం మూసి ఉంటుందని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Yoga Andhra 2025: ప్రధాన వేదిక ఆర్కే బీచ్.. మార్పు చేయాల్సి వస్తే?

ఇరాన్ సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై కొత్త క్షిపణి దాడులను ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా వైమానిక దాడుల సైరన్‌లను మోగించింది. ఈ దాడుల్లో కనీసం 67 మంది ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు. ఇజ్రాయెల్ పౌరులను ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని.. తాము కూడా టెహ్రాన్ నివాసితులే లక్ష్యంగా భీకర దాడులు ఉంటాయని ఇజ్రాయెల్ రక్షణ శాఖ హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: Keerthy Suresh & Suhas : ‘ఉప్పు కప్పురంబు’ డైరెక్ట్ ఓటీటీలోకి..

ఇదిలా ఉంటే ఇరాన్‌పై ఇజ్రాయెల్ అణు దాడి చేస్తే.. పాకిస్థాన్ రంగంలోకి దిగి ఇజ్రాయెల్‌పై అణు దాడి చేస్తుందని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)లో సీనియర్ అధికారి, ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు మొహ్సేన్ రెజాయ్ హెచ్చరించారు. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పాకిస్థాన్ మాకు మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. అంతేకాకుండా టెహ్రాన్‌ దగ్గర ప్రపంచానికి తెలియని శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

 

Exit mobile version