Site icon NTV Telugu

Amazon: 14,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది ఇందుకే.. క్లారిటీ ఇచ్చిన అమెజాన్..

Amazon Ceo Andy Jassy

Amazon Ceo Andy Jassy

Amazon: టెక్ లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా, అమెజాన్ 14,000 మంది ఉద్యోగుల్ని తీసేసింది. దీనిపై అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ స్పందించారు. ఉద్యోగుల తొలగింపు ‘‘ వర్క్ కల్చర్’’కు సంబంధించిందని చెప్పారు. తొలగింపులు AI కోసం, డబ్బు కోసం కాదని ఆయన స్పష్టం చేశారు.

Read Also: SBI Website New URL: డొమైన్, URL లను మార్చుకున్న SBI సహా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు.. కారణం ఏంటంటే?

తాజాగా ఉద్యోగుల తొలగింపు అమెజాన్ నిర్ణయాధికార స్థాయిల్ని సులభతరం చేస్తుందని, బ్రూరోక్రసీని తగ్గిస్తుందని చెప్పారు. తేలికగా, వేగంగా పనిచేసేలా చర్యలు తీసుకునేందు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సంస్థ పెద్దదవుతున్న నేపథ్యంలో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం, నాయకత్వ స్థాయిలో ఆలస్యం పెరుగుతోందని, అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్‌లా పని చేయాలన్న లక్ష్యంతో ఈ మార్పులు చేస్తున్నామని తెలిపారు.

2021లో అమెజాన్ ఉద్యోగుల సంఖ్య 1.6 మిలియన్లు ఉంటే, 2024 చివరికి ఇది 1.5 మిలియన్లకు తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని టెక్ కంపెనీలు AI , టెక్నాలజీ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాయి, దీంతోనే ఖర్చల్ని తగ్గించుకుంటున్నాయి. దీంతో, ఉద్యోగులను తొలగిస్తూ డబ్బును ఆదా చేస్తున్నారు. అమెజాన్ కూడా ఇదే తరహాలో ఉద్యోగులను తొలగించిందని అంతా అనుకుంటున్న నేపథ్యంలో, అమెజాన్ సీఈఓ నుంచి ఈ క్లారిటీ వచ్చింది.

Exit mobile version