Site icon NTV Telugu

Sheikh Hasina: త్వరలోనే బంగ్లాకు తిరిగొస్తా.. అందుకే ఆ అల్లా నన్ను బతికించాడు..

Haina

Haina

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ దేశానికి తిరిగి వెళ్లనున్నట్లు ప్రకటించింది. సోషల్‌ మీడియా వేదికగా ఆవామీ లీగ్‌ పార్టీ కార్యకర్తలతో జరిగిన సంభాషణ సందర్భంగా ఈ విషయం తెలియజేసింది. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్ పై తీవ్ర విమర్శలు చేసింది. యూనస్‌కు ప్రజల మీద ప్రేమ లేదు.. అధిక వడ్డీకి రుణాలు ఇచ్చి ఆయన విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపి వచ్చారని పేర్కొనింది. ఆ సమయంలో ఆయన తీరును తాము అర్థం చేసుకోలేకపోయాం అని చెప్పుకొచ్చింది. అతడికి దేశం ఎంతో సహాయం చేసిందన్నారు. ఇక, ఏదో ఒక కారణంతోనే ఆ దేవుడు నన్ను ఇంకా బతికించాడు.. అవామీ లీగ్ పార్టీ సభ్యులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారికి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుంది.. నేను త్వరలోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తాను అని షేక్‌ హసీనా భరోసా ఇచ్చారు.

Read Also: IPL 2025: మంగళవారం రెండు ఐపీఎల్‌ మ్యాచ్‌లు.. ఇదే మొదటిసారి! కారణం ఏంటో తెలుసా?

అయితే, మహమ్మద్ యూనస్‌ నిర్ణయాలతో దేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు అని షేక్ హసీనా తెలిపింది. అతడికి అధికారంపై వ్యామోహం మాత్రమే ఉంది.. వారి సారథ్యంలో బంగ్లాదేశ్ ప్రస్తుతం ఉగ్రవాద దేశంగా మారిపోతుందని ఆరోపించింది. మన నాయకులు, కార్యకర్తలను దారుణంగా హత్య చేస్తున్నారు.. పోలీసులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కళాకారులు ఇలా ఎంతో మందిని టార్గెట్ గా చేసుకున్నారు.. ప్రస్తుతం దేశంలో ఎన్నో అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు కొనసాగుతున్నాయి.. కానీ, ఇవి మీడియాలో రాకుండా చూస్తున్నారని హసీనా తెలిపింది.

Read Also: రాబోయే 50 ఏళ్లలో ఏ దేశం ఎన్ని సార్లు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడబోతుందంటే..?

అలాగే, తన కుటుంబం మొత్తం హత్యలకు గురైన సంఘటనలను షేక్ హసీనా గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంది. నాడు వారు మమ్మల్ని దేశంలోకి రానివ్వలేదు.. మీ సొంత వారిని కోల్పోయి ఇప్పుడు మీరందరూ ఎంత బాధ అనుభవిస్తున్నారో నాకు తెలుసు అని పేర్కొనింది. నా ద్వారా మీ అందరికీ మంచి చేయాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాడు.. అందుకే నన్ను ఆ అల్లా ఇంకా రక్షిస్తున్నాడు.. నేను తిరిగి వచ్చిన తర్వాత అందరికి న్యాయం చేస్తానని మాజీ ప్రధాని షేక్ హసీనా హామీ ఇచ్చింది.

Exit mobile version