Ali Khamenei Funeral: తండ్రి అంత్యక్రియలకు మొజ్తాబా ఖమేనీ గైర్హాజరు.. ఇజ్రాయిల్ భయమే కారణమా.?

  • అలీ ఖమేనీ అంత్యక్రియల్లో మొజ్తాబా ఖమేనీ మిస్సింగ్..
  • ఇజ్రాయిల్ భయం, భద్రతా కారణాల వల్లే గైర్హాజరు..
Iran News

Iran News

Ali Khamenei Funeral: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆయన ముగ్గురు కుమారుడు మోస్తఫా ఖమేనీ, మేసమ్ ఖమేనీ, మసూద్ ఖమేనీ హాజరయ్యారు. ఆయన వారసుడు, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ అంత్యక్రియలకు గైర్హాజరయ్యారు. మొజ్తాబా ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. జూలై 9న మష్హద్‌లోని ఇమామ్ రెజా పవిత్ర క్షేత్రంలో అలీ ఖమేనీకి అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. ఆ కార్యక్రమానికి మొజ్తబా ఖమేనీ హాజరయ్యే అవకాశం ఉందని కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ఇమామ్ ఖోమేనీ గ్రాండ్ మోసల్లాలో జరిగిన అంత్యక్రియాల్లో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ ఘాలిబాఫ్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(IRGC) కమాండర్ అహ్మద్ వహీది సహా పలువురు కీలక వ్యఖ్యలు పాల్గొన్నారు. ఖమేనీ శవపేటికతో పాటు ఆయనతో పాటు దాడిలో మరణించిన ఇతర కుటుంబ సభ్యుల శవపేటికలు కూడా ఉంచారు. ఇందులో 14 నెలల మనవరాలి శవపేటికను చూసి చాలా మంది ఇరాన్ ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సంతాప కార్యక్రమాల్లో కోటి మందికి పైగా ప్రజలు పాల్గొంటారని ఇరాన్ అధికారులు అంచనా వేస్తున్నారు.

కొత్తగా సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిని మొజ్తాబా ఖమేనీ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బహిరంగంగా కనిపించలేదు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో తండ్రి చనిపోవడంతో పాటు మొజ్తాబా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఇజ్రాయిల్ నుంచి ముప్పు పొంచి ఉండటంతో ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేదని తెలుస్తోంది.