Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- అంగరంగ వైభవంగా జరిగిన అనాథ బాలిక పెళ్లి
- రాత్రికి రాత్రే మారిపోయిన బాలిక జాతకం
- అత్యంత రద్దీగా వివాహంగా మారిన అనాథ పెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ బాలిక ఓ అనాథ. ప్రపంచంలో నా అన్నవాళ్లు ఎవరూ లేరు. అయితే పెళ్లి చేసుకోవడానికి ఓ యువకుడు ముందుకొచ్చాడు. అయితే వచ్చే అతిథులకు విందు చేయడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. అయితే పెళ్లికి రెండు రోజుల ముందు ఆమె తలరాత మారిపోయింది. ఓ టీవీ యాంకర్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. ‘‘నీకు ఏం కావాలి?’’ అని టీవీ వ్యాఖ్యాత అడిగింది. దానికి అనాథ బాలిక.. తన పెళ్లికి వచ్చే అతిథులకు భోజనం పెట్టడానికి పొరుగు వారు ఎవరైనా రెండు కోళ్లు దానం చేయాలని విజ్ఞప్తి చేసింది. బాలిక చేసిన మనవి యావత్తు దేశాన్ని కన్నీరు పెట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇంకేముంది రాత్రికి రాత్రే ఆమె జాతకం మారిపోయింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. వేలాది మంది ఆమె పెళ్లికి హాజరై.. ఇల్లు సరిపోనంతగా బహుమతులు తెచ్చి ఇచ్చారు. ఒక వ్యాపారి అయితే విలువైన ఆభరణాలు ఇచ్చాడు. దేశాన్ని కన్నీరు పెట్టించిన ఆమె వెనుక ఉన్న కథేంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
వధువు పేరు షహరాజాద్.. అనాథ. ఉత్తర ఆఫ్రికాలోని అల్జీరియా ప్రాంతానికి చెందిన వాసి. బాలిక పెళ్లికి రెండు రోజుల ముందు ఒక టీవీ వ్యాఖ్యాత కలిసి ‘నీకు ఏం కావాలి’’ అని అడిగింది. దానికి చాలా అమాయకంగా సమాధానం ఇచ్చింది. తన పెళ్లికి వచ్చే అతిథులకు వడ్డించడానికి పొరుగువారు ఎవరైనా రెండు కోళ్లు దానం చేయాలని అడిగింది. అమాయకంగా బాలిక చేసిన విజ్ఞప్తి వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంకేముంది అల్జీరియా మొత్తం బాలిక కుటుంబంగా మారిపోయింది. దేశమంతా అనాథకు అండగా నిలిచారు. వేలాది మంది ఆమె పెళ్లికి హాజరై ఇల్లు సరిపోనంతగా ఖరీదైన బహుమతులు తెచ్చి ఇచ్చారు. కొందరు బంగారు ఆభరణాలు కూడా తెచ్చి ఇచ్చారు. ఈ పరిణామంతో బాలిక ఉబ్బితబ్బిబ్బు అయింది. ఒక ఆభరణాల వ్యాపారి అయితే షహరాజాద్కు రెండు బంగారు ఆభరణాల సెట్‌ను బహుమతిగా ఇచ్చాడు.
Also Read
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
షహరాజాద్ వివాహానికి వేలాది మంది హాజరై దీవించారు. ఈ వేడుక అల్జీరియన్ల ఐక్యతను, ఇతరుల ఆనందంలో పాలుపంచుకోవాలనే సందేశం తెలియజేసింది. అల్జీరియాలో ఇప్పటివరకు జరిగిన వివాహ వేడుకలన్నింటిలోకీ ఇదే అత్యంత రద్దీగా, ఉత్సాహభరితంగా జరిగిందని సోషల్ మీడియాలో ప్రజలు చర్చించుకుంటున్నారు.
تمنت دجاجتين فأقاموا لها عرسًا استثنائيًا.. احتفاء واسع في الجزائر بعروس عين الدفلى اليتيمة https://t.co/xKS3bXdAUn
— التلفزيون العربي (@AlarabyTV) October 12, 2026
తాజావార్తలు
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
-
Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!