NTV Telugu Site icon

Alexander Dugin: గెలిచే దాకా యుద్ధం ఆగదు.. లేదంటే ప్రపంచ వినాశనమే

Alexander Dugin

Alexander Dugin

Alexander Dugin Controversial Statement On Russia Ukraine War: ఓవైపు ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ఆగాలని ప్రపంచం కోరుకుంటుంటే.. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సలహాదారు అలెగ్జాండర్ డుగిన్ మాత్రం రష్యా గెలిచేదాకా ఈ యుద్ధం ఆగదంటూ సంచలన ప్రకటన చేశాడు. ఉక్రెయిన్‌పై విజయం సాధించిన తర్వాతే ఈ యుద్ధం ఆగుతుందని, అప్పటివరకూ ఆ దేశంపై దాడులు కొనసాగుతూనే ఉంటాయని కుండబద్దలు కొట్టారు. యుద్ధం ఆపే ప్రసక్తే లేదని.. లేదంటే ప్రపంచ వినాశనం తప్పదని హెచ్చరించారు. అంటే.. తమ దారిలో అడ్డొచ్చే వారిని సైతం వదిలిపెట్టమని ఆయన పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లు అర్థమవుతోంది.

China Covid: చైనాలో కొవిడ్ పంజా.. ఏప్రిల్ నాటికి గరిష్ఠ స్థాయి కేసులు

ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అలెగ్జాండర్ డుగిన్ మాట్లాడుతూ.. ఇది ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధమని పేర్కొన్నారు. ఈ యుద్ధం రష్యాకు, ఉక్రెయిన్‌కు, యూరోప్‌కు, పశ్చిమ దేశాలకు లేక మరే ఇతర దేశాలకి వ్యతిరేకంగా జరగడం లేదని.. ఇది ఆధిపత్యానికి వ్యతిరేకంగా మానవత్వం కోసం జరుగుతున్న యుద్ధమని స్పష్టం చేశారు. మరి.. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందని ప్రశ్నిస్తే, అందుకు రెండు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఒకటి.. ఉక్రెయిన్‌పై తాము గెలవడమని, అయితే అదంతా సులువు కాదని అన్నారు. ఇక రెండోది.. ప్రపంచ వినాశనంతో ఈ యుద్ధం ఆగుతుందని బాంబ్ పేల్చారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగనిదే.. రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగదని డుగిన్ క్లారిటీ ఇచ్చారు.

IRCTC Contractor Fined: రూ. 5 ఎక్కువగా వసూలు చేశాడు.. ఒక లక్ష ఫైన్ కట్టాడు

ఉక్రెయిన్‌పై విజయం సాధించడం తప్ప.. తాము మరే ఇతర పరిష్కారాన్ని స్వాగతించమని డుగిన్ వెల్లడించాడు. ఇక ఇటీవల తన కుమార్తె జ్ఞాపకార్థం నిర్వహించిన ఈవెంట్‌లో అతను మాట్లాడుతూ.. ఉక్రెయిన్ ఉగ్రవాదుల చేతుల్లో తన కుమార్తె చనిపోయిందని వ్యాఖ్యానించాడు. కాగా.. ఫిబ్రవరి 24వ తేదీ ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగినప్పటి నుంచి వేలాదిమంది చనిపోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇంకా యుద్ధం తీవ్రంగా మారడంతో.. చర్చలతో దీన్ని ముగింపు పలికేందుకు రెండు దేశాలు మొగ్గు చూపట్లేదు.