అమెరికాలో ఓ పైలట్.. ప్రయాణికులకు షాకిచ్చాడు. అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత పైలట్ వ్యవహారించిన తీరుతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. స్కైవెస్ట్ నిర్వహించే 3491 విమానం వొమింగ్‌లోని జాక్సన్ హోల్ ఎయిర్ పోర్టుకు బయల్దేరింది. తీరా విమానాశ్రయం చేరుకొనేసరికి అక్కడ ల్యాండ్ చేయడానికి తనకు సరైన అర్హత లేదని ఇంటర్‌కమ్‌లో ప్రయాణికులకు వెల్లడించాడు. దీంతో వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఇది కూడా చదవండి: Venkatesh Iyer: ఇంగ్లాండ్‌లో అదరగొట్టిన ఐపీఎల్ స్టార్ క్రికెటర్..
విమాన సిబ్బంది ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేస్తుండగా ఇంటర్‌కమ్‌లో పైలట్ షాకింగ్ ప్రకటన చేశాడు. ‘హాయ్.. నన్ను క్షమించండి. జాక్సన్ హోల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయడానికి నాకు సరైన అర్హత లేదు. ఇప్పుడు మనం ఉటాలోని సాల్ట్ లేక్ సిటీకి వెళ్లాల్సి ఉంటుంది. మీకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తాను’ అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విమాన ప్రయాణికుడు ఒకరు రెడిట్‌లో పోస్టు చేశారు. ఆ తర్వాత విమానం సాల్ట్‌లేక్ సిటీలో ల్యాండ్ అయింది. ఆ సమయంలో తీవ్రంగా కుదుపులకు లోనైనట్లు ప్రయాణికులు వాపోయారు. అక్కడే దాదాపు గంటన్నర సేపు ఉండిపోయింది. తర్వాత మరో పైలట్ వచ్చి విమానం బాధ్యతలు తీసుకొన్నాడు. తిరిగి అది జాక్సన్‌హోల్ ఎయిర్ పోర్టుకు చేరుకొంది. ఇక దీనిపై స్కైవెస్ట్ ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ.. సరైన పత్రాలు లేకపోవడంతో మళ్లించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. మూడు గంటల ఆలస్యం తర్వాత గమ్యం చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇది కూడా చదవండి: Independence Day 2024: భారత ప్రజలకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ శుభాకాంక్షలు..