Site icon NTV Telugu

Artificial intelligence(AI): ఏఐలో 40 శాతం ఉద్యోగాలు ఖతం.. ఐఎంఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

Imf

Imf

Artificial intelligence(AI): భవిష్యత్ కాలమంతా టెక్నాలజీదే. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) విస్తరిస్తోంది. ప్రతీ రంగంలో కూడా రానున్న కాలంలో ఏఐ కీలక ప్రభావం చూపించనుంది. అయితే ఏఐ వల్ల ప్రమాదం ఉందనే టెక్ ప్రముఖులు కూడా ఉన్నారు. మరికొందరు దీని వల్ల ప్రజల జీవితం మరింతగా సులువు అవుతుందని మరికొందరు చెబుతున్నారు. ఎలా ఉన్నా ఏఐ పూర్తిస్థాయిలో అమలులోకి వస్తే మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉద్యోగులపై ప్రభావం తప్పకుండా ఉంటుందని పలువరు ప్రముఖులు చెబుతున్నారు.

Read Also: Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట విషాదం..

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)చీఫ్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ప్రమాదాలను కలిగిస్తుందని, అదే సమయంలో ఉత్పాదకత స్థాయిల్ని పెంచడానికి, ప్రపంచ వృద్ధికి దోహదపడే అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలియా జర్జివా చెప్పారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వార్షిక వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు బయలుదేరే కొద్దిసేపటి ముందు వాషింగ్టన్‌లో ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏఐ తక్కువ ప్రభావాన్ని చూపుతుందని అంచనా వేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో 60 శాతం ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందన్నారు. ‘‘మీరు ఎంత ఎక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగంలో ఉన్నారో.. అంత ఎక్కువ ప్రభావం ఉంటుంది’’ అని అన్నారు.

ఇదిలా ఉంటే ఐఎంఎఫ్ నివేదికలో ఏఐ ప్రభావంతో సగం ఉద్యోగాలు మాత్రమే ప్రభావితమవుతాయని పేర్కొంది. మిగతా ఉద్యోగాల్లో ఏఐ వల్ల మెరుగైన ఉత్పాదకత లాభాలను నుంచి ప్రయోజనం పొందవచ్చని నివేదికలో చెప్పింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలోని లేబర్ మార్కెట్లు ఏఐ నుంచి తక్కువ ప్రభావాన్ని కలిగి ఉండటమే కాకుండా.. ఏఐ వల్ల ప్రొడక్టివిటీకి తక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్పింది.

Exit mobile version