Site icon NTV Telugu

Afghanistan: అమెరికా వదిలిన హెలికాఫ్టర్ నడపాలనుకున్న తాలిబాన్లు.. చివరకు..

Afghanistan

Afghanistan

Taliban Try Flying Chopper Left Behind By US, Crash It: ఆఫ్ఘనిస్తాన్ దేశంలో అధికారం చేజిక్కించుకున్న తాలిబాన్లు.. సైనికపరంగా కూడా బలపడాలని కోరుకుంటున్నారు. గతంలో యూఎస్ మిలిటరీ, ఆప్ఘన్ సైన్యంలో పనిచేసిన వారిని తిరిగి విధుల్లో చేరాలని అధికారం చేపట్టిన తర్వాత కోరారు. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం ఉండటం, అంతర్గతంగా కూడా ఐసిస్ ప్రభావం ఎక్కువ అవుతుండటంతో తాలిబన్ ప్రభుత్వం తమకు సైన్యం ఉండాలని కోరుకుంటోంది.

ఇదిలా ఉంటే అమెరికా సంక్షీర్ణ దళాలు తమ ఆయుధాలను, హెలికాప్టర్లను ఆఫ్ఘనిస్తాన్ లోనే వదిలి వెళ్లాయి. అయితే వెళ్లే క్రమంలో వాటిలో హార్డ్ వేర్ ను ధ్వంసం చేశాయి. కాగా.. తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాలిబాన్ ఫైటర్లు వీడిని వాడుతున్నారు. యూఎస్ బలగాలు విడిచి వెళ్లిన ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నారు. ఇదిలా ఉంటే కొన్ని సందర్భాల్లో వాటిని వాడటం కూడా తాలిబాన్ ఫైటర్లకు రావడం లేదు.

Read Also: Asia Cup 2022: నేడు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్.. పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక

తాజాగా.. అమెరికా వదిలి వెళ్లిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ తో తాలిబాన్ శిక్షణా విన్యాసాలు చేపట్టింది. ఈ సమయంలో బ్లాక్ హాక్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్లు తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాల్లో హెలికాప్టర్ కూలిపోయినట్లు ఇందులో ముగ్గురు చనిపోగా.. ఐదుగురు గాయపడినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎనాయితుల్లా ఖౌరాజ్మీ తెలిపారు. ప్రస్తుతం తాలిబాన్లు వాడుతున్న సైనిక సామాగ్రిలో ఎన్ని పనిచేస్తున్నాయో తెలియదు. అమెరికా దళాలు ఆప్ఘనిస్తాన్ వదిలి వెళ్లే సమయంలో కొన్ని హెలికాప్టర్లను మధ్య ఆసియా దేశాలకు తరలించగా.. మరికొన్నింటిని ఆప్ఘనిస్తాన్ లోనే ఉంచారు.

Exit mobile version