తాలిబన్ల మరో సంచలన నిర్ణయం.. ఏకంగా ఆ శాఖే ఎత్తేశారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్థాన్‌లో తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. తమ అరాచకాలను కొనసాగిస్తున్నారు.. గతంలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తున్నారు.. మహిళలకు రక్షణ కల్పిస్తామంటూనే.. మహిళలపై ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు.. ఏ ఆటలు ఆడొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.. బాలురు-బాలికలు కలిచి చదువుకోవడానికి వీలులేదని స్పష్టంచేశారు.. బాలికలకు మహిళలే పాఠాలు చెప్పాలని.. మహిళలు బాలురకు కూడా పాఠాలు బోధించొద్దు అంటూ.. పిచ్చిపిచ్చి షరతులు పెట్టారు.. ఒకేవేళ కో-ఎడ్యుకేషన్ కొనసాగినా.. తరగతి గదిలో అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య తెరలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు..
ఇక, తమకు రక్షణ కల్పించాలంటూ.. ప్రభుత్వంలో అవకాశం ఇవ్వాలంటూ ఓవైపు మహిళలు ఆందోళన చేస్తున్న సమయంలో.. ఏకంగా మహిళా మంత్రిత్వ శాఖ పేరునే మార్చేశారు తాలిబన్లు.. గత 20 ఏళ్లుగా ఉన్న మహిళా మంత్రిత్వ శాఖ భవనానికి ‘ధర్మ రక్షణ, అధర్మ నిర్మూలన’ శాఖ అని పేరు పెట్టారు. ఆ మేరకు దరి, అరబ్బీ భాషల్లో బోర్డులు ఏర్పాటు చేశారు. కాగా.. మహిళలను ఉద్యోగం చేయనివ్వాలంటూ కాబూల్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంలో కూడా చోటు కల్పించాలని ఆందోళన చేస్తుండగా.. అవి ఏవీ పట్టని తాలిబన్లు.. ప్రపంచంలోనే కరుడుగట్టిన ఉగ్రవాదులతో కేబినెట్ ఏర్పాటు చేశారు.. వారి కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా స్థానం లేకపోండంతో.. అసలు మహిళా మంత్రిత్వశాఖ ఎందుకు అనుకున్నారో ఏమో.. ఆ శాఖ పేరునే మార్చి.. మరోసారి వార్తల్లో నిలిచారు తాలిబన్లు.
Also Read
తాజావార్తలు
-
Saturday Horoscope: ఆ రాశి వారు శత్రువులపై పైచేయి సాధిస్తారు.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Priyanka Chopra: ఆస్కార్ విజేత రస్సెల్ క్రోతో ప్రియాంక చోప్రా.. హాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్ట్‌కు రెడీ!
-
HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్‌కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
-
Travis Head: చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ఒక్క ఓటుతో సంచలన విజయం..
-
Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్‌లు విధించేలా చట్టం
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!