ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పటి వరకు సాగిన పాలనకు పూర్తి విరుద్దంగా పాలన జరగబోతున్నది. తాలిబన్ల చేతిల్లోకి అధికారం వెళ్లిపోయింది. రెండు దశాబ్దాల క్రితం ఎలాంటి కౄరమైన పాలనను అక్కడి ప్రజలు చూశారో దాదాపుగా అదేవిధమైన పాలనలను మళ్లీ ఇప్పుడు చూడబోతున్నారు. తాము శాంతియుతమైన అంతర్జాతీయ సంబంధాలు కోరుకుంటున్నామని చెబుతున్నప్పటికీ వారు ఎలాంటి పాలన అందిస్తారో అందరికీ తెలిసిందే. మహిళలు, చిన్నపిల్లలకు ఆ దేశంలో రక్షణ ఉండదు. 12 ఏళ్లు దాటిన మహిళలు ఎవరూ బయటకు రాకూడదు. చదువు పేరుతో స్కూళ్లకు వెళ్ళడం నిషేదం. వస్త్రధారణ విషయంలోకూడా తాలిబన్లు కౄరంగా వ్యవహరిస్తారు. ఇక రాజకీయాల్లో మహిళలు ఉండటం అంటే అది ఏ మాత్రం కుదరని పని. ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో మొదిటిసారి ఓ మహిళ మేయర్‌గా ఎంపికైంది. 27 ఏళ్ల జరీఫా గఫారీ మేదాన్ వార్దాక్ ప్రావిన్స్‌కు మేయగా 2018 లో ఎంపికయింది. అప్పటి నుంచి జరీఫా ప్రావిన్స్ అభివృద్దికి కృషిచేస్తున్నది. గత పదిరోజుల వ్యవధిలోనే ఆఫ్ఘన్ చరిత్ర మొత్తం మారిపోవడంతో ప్రస్తుతం కాబూల్‌లోని తన నివాసానికే పరిమితం అయింది. ఆఫ్ఘన్‌లో తాలిబన్ల కౄరపాలన మొదలైందని, మహిళలకు ఏ మాత్రం రక్షణ ఉండదని, తన లాంటివారి కోసం తాలిబన్లు తప్పకుండా వస్తారని, తాను భయపడి దేశం విడిచి పారిపోనని, తాలిబన్లు చంపినా తాను దేశం వదిలి వేళ్లేది లేదని తెగించి చెప్పేసింది జరీఫా.
ఆఫ్ఘన్ మొదటి మహిళా మేయర్ సంచలన వ్యాఖ్యలు… రండి…చంపండి…
