Site icon NTV Telugu

Earthquake: ఆప్ఘనిస్థాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు

Earthquakebihar

Earthquakebihar

ఆప్ఘనిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.9గా నమోదైంది. బుధవారం ఉదయం 4:43 గంటలకు హిందూకుష్ ప్రాంతంలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(ఎన్‌సీఎస్) అధికారులు తెలిపారు. ఈ భూకంపం 75 కి.మీ లోతులో సంభవించింది. భూకంప కేంద్రం తూర్పున 164 కి.మీ దూరంలో ఉందని ఏజెన్సీ తెలిపింది.

ఇది కూడా చదవండి: PBKS vs KKR: ఈ వయసులో మ్యాచ్‌లు చూడాల్సిన అవసరం లేదు: రికీ పాంటింగ్‌

ఇదిలా ఉంటే భూప్రకంపనలు భారత్‌ను కూడా తాకాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే భూకంపానికి సంబంధించిన దృశ్యాలు కొందరు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇది కూడా చదవండి: Polavaram: నేడు పోలవరంలో పర్యటించనున్న కేంద్ర నిపుణుల బృందం..

Exit mobile version