Abortion: గర్భం దాల్చిన 12 వారాల వరకు అబార్షన్ మాత్రలు సురక్షితం.. లాన్సెట్ స్టడీ..
- గర్భం దాల్చిన 12 వారాల వరకు అబార్షన్ మాత్రలు సురక్షితం.. లాన్సెట్ అధ్యయనంలో కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abortion: ఇంట్లోనే మాత్రలను వినియోగించి అబార్షన్ నిర్వహించడం సురక్షితమని, ఆస్పత్రి భారాన్ని తగ్గించవచ్చని లాన్సెట్ జర్నల్‌లో శుక్రవారం ప్రచురితమైన ఒక అధ్యయనం పేర్కొంది. స్వీడన్‌కి చెందిన పరిశోధకులు 435 మంది మహిళలపై ట్రయల్స్ నిర్వహించాయి. ఇంట్లో లేదా ఆస్పత్రిలో మిసోప్రోస్టోల్ (వైద్య గర్భస్రావ ప్రక్రియలో భాగంగా ఇచ్చిన మాత్ర)లు తీసుకున్న మహిళల్ని వీరు విశ్లేషించారు.
ఆస్పత్రిలో మిసోప్రోస్టల్ మొదటి డోస్ తీసుకున్న 46 శాతం మంది మహిళలతో పోలిస్తే, ఇంట్లోనే మాత్రలను తీసుకున్న వారు రాత్రి పూట ఆస్పత్రుల్లో 9 గంటల పాటు ఉండకుండా, తమ సంరక్షణను పూర్తిగా చూసుకునే అవకాశం 71 శాతంగా ఉందని గుర్తించారు. ఇంట్లో ఉన్నవారితో పోలిస్తే ఆస్పత్రిల్లో ఉన్న మహిళల అబార్షన్ ఒత్తిడితో పాటు ఒంటరిగా ఉండే అవకాశం ఉంది.
Also Read
- Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
- Trump Marine One: ట్రంప్‌కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
- Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
- Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
Read Also: Weather Alert: గుజరాత్ సమీపంలో తీవ్ర అల్పపీడనం.. 6 గంటల్లో తుఫాన్‌గా మారే ఛాన్స్
సాధారణంగా అబార్షన్‌కి రెండు రకాల పిల్స్ ఇస్తారు మిఫెప్రిస్టోన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్‌ని అడ్డుకుంటుంది. దీంతో గర్భాశయ లైనింగ్ విచ్ఛిన్నం అయ్యేలా చేస్తుంది. ఇది సాధారణంగా క్లినిక్‌లో సూచించబడుతుంది. మిసోప్రోస్టోల్ గర్భం సంకోచించేలా చేస్తుంది, ఇది రెండు రోజుల తర్వాత తీసుకోవచ్చు. అబార్షన్ పూర్తయ్యే వరకు ప్రతీ కొన్ని గంటలకు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇంట్లో మిసోప్రోస్టోల్ ఫస్ట్ డోస్ తీసుకోవడం, ఆస్పత్రిలో దీనిని తీసుకునే దానితో పోలిస్తే సురక్షితమైన, ప్రభావవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని పరిశోధకులు చెప్పారు. మునుపటి అధ్యయనాల ప్రకారం, గర్భం దాల్చిన 12 వారాల తర్వాత మిసోప్రోస్టోల్ మొదటి డోస్ తీసుకుంటే అబార్షన్ 8-12 గంటల పూర్తవుతాయని, సగటున రెండు నుంచి మూడు డోసుల మిసోప్రోస్టోల్ డోసులు అవసరం అవుతాయని సూచించాయి. ఈ ప్రక్రియలో కొంతమంది రోగులు రాత్రిపూట ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుంది. తాజా అధ్యయనంలో ఇంట్లో మిసోప్రోస్టోల్ తీసుకున్న మహిళల్లో 1 శాతం మంది తదుపరి డోస్ కోసం ఆస్పత్రికి వెళ్లే ముందే గర్భస్రావం పూర్తి చేసినట్లు పరిశోధకులు తెలిపారు. హోమ్ ట్రీట్‌మెంట్ గ్రూప్‌లోని (1 శాతం) రోగులకు మిసోప్రోస్టోల్ మొదటి డోస్ తీసుకున్న తర్వాత ఒకటి నుండి రెండు గంటల మధ్య ఆసుపత్రికి వెళ్లే మార్గంలో గర్భస్రావం జరిగింది.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!