NTV Telugu Site icon

Abortion: గర్భం దాల్చిన 12 వారాల వరకు అబార్షన్ మాత్రలు సురక్షితం.. లాన్సెట్ స్టడీ..

Abortion

Abortion

Abortion: ఇంట్లోనే మాత్రలను వినియోగించి అబార్షన్ నిర్వహించడం సురక్షితమని, ఆస్పత్రి భారాన్ని తగ్గించవచ్చని లాన్సెట్ జర్నల్‌లో శుక్రవారం ప్రచురితమైన ఒక అధ్యయనం పేర్కొంది. స్వీడన్‌కి చెందిన పరిశోధకులు 435 మంది మహిళలపై ట్రయల్స్ నిర్వహించాయి. ఇంట్లో లేదా ఆస్పత్రిలో మిసోప్రోస్టోల్ (వైద్య గర్భస్రావ ప్రక్రియలో భాగంగా ఇచ్చిన మాత్ర)లు తీసుకున్న మహిళల్ని వీరు విశ్లేషించారు.

ఆస్పత్రిలో మిసోప్రోస్టల్ మొదటి డోస్ తీసుకున్న 46 శాతం మంది మహిళలతో పోలిస్తే, ఇంట్లోనే మాత్రలను తీసుకున్న వారు రాత్రి పూట ఆస్పత్రుల్లో 9 గంటల పాటు ఉండకుండా, తమ సంరక్షణను పూర్తిగా చూసుకునే అవకాశం 71 శాతంగా ఉందని గుర్తించారు. ఇంట్లో ఉన్నవారితో పోలిస్తే ఆస్పత్రిల్లో ఉన్న మహిళల అబార్షన్ ఒత్తిడితో పాటు ఒంటరిగా ఉండే అవకాశం ఉంది.

Read Also: Weather Alert: గుజరాత్ సమీపంలో తీవ్ర అల్పపీడనం.. 6 గంటల్లో తుఫాన్‌‌గా మారే ఛాన్స్

సాధారణంగా అబార్షన్‌కి రెండు రకాల పిల్స్ ఇస్తారు మిఫెప్రిస్టోన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్‌‌ని అడ్డుకుంటుంది. దీంతో గర్భాశయ లైనింగ్ విచ్ఛిన్నం అయ్యేలా చేస్తుంది. ఇది సాధారణంగా క్లినిక్‌లో సూచించబడుతుంది. మిసోప్రోస్టోల్ గర్భం సంకోచించేలా చేస్తుంది, ఇది రెండు రోజుల తర్వాత తీసుకోవచ్చు. అబార్షన్ పూర్తయ్యే వరకు ప్రతీ కొన్ని గంటలకు తీసుకోవాల్సి ఉంటుంది.

ఇంట్లో మిసోప్రోస్టోల్ ఫస్ట్ డోస్ తీసుకోవడం, ఆస్పత్రిలో దీనిని తీసుకునే దానితో పోలిస్తే సురక్షితమైన, ప్రభావవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని పరిశోధకులు చెప్పారు. మునుపటి అధ్యయనాల ప్రకారం, గర్భం దాల్చిన 12 వారాల తర్వాత మిసోప్రోస్టోల్ మొదటి డోస్ తీసుకుంటే అబార్షన్ 8-12 గంటల పూర్తవుతాయని, సగటున రెండు నుంచి మూడు డోసుల మిసోప్రోస్టోల్ డోసులు అవసరం అవుతాయని సూచించాయి. ఈ ప్రక్రియలో కొంతమంది రోగులు రాత్రిపూట ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుంది. తాజా అధ్యయనంలో ఇంట్లో మిసోప్రోస్టోల్ తీసుకున్న మహిళల్లో 1 శాతం మంది తదుపరి డోస్ కోసం ఆస్పత్రికి వెళ్లే ముందే గర్భస్రావం పూర్తి చేసినట్లు పరిశోధకులు తెలిపారు. హోమ్ ట్రీట్‌మెంట్ గ్రూప్‌లోని (1 శాతం) రోగులకు మిసోప్రోస్టోల్ మొదటి డోస్ తీసుకున్న తర్వాత ఒకటి నుండి రెండు గంటల మధ్య ఆసుపత్రికి వెళ్లే మార్గంలో గర్భస్రావం జరిగింది.