NTV Telugu Site icon

Maternal Mortality: ప్రతీ రెండు నిమిషాలకు ఓ తల్లి మరణిస్తోంది.. యూఎన్ రిపోర్ట్..

Un Report

Un Report

Maternal Mortality: ప్రసూతి మరణాల రేటు గత 20 ఏళ్లలో మూడో వంతు తగ్గినప్పటికీ.. గర్భం, ప్రసవ సమస్యల కారణంగా ప్రపంచంలో ప్రతీ రెండు నిమిషాకలు ఓ మహిళ మరణిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి గురువారం వెల్లడించింది. 2000 నుంచి 2015 మధ్య మరణాల రేటు గణనీయంగా పడిపోయినప్పటికీ.. 2016-2020 మధ్య అలాగే స్థిరంగా ఉన్నట్లు, కొన్ని ప్రాంతాల్లో పెరిగినట్లు యూఎన్ తెలిపింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూఎన్ ఏజెన్సీల నివేదిక ప్రకారం గత 20 ఏళ్లలో మొత్తం ప్రసూతి మరణాల రేటు 34.8 శాతం తగ్గింది. 2000 ఏడాదిలో ప్రతీ లక్ష జననాలకు 339 ప్రసూతి మరణాలు సంభవిస్తే.. అదే 2020 నాటికి 223 ప్రసూతి మరణాలు నమోదు అయ్యాయి. అయినప్పటికీ.. 2020లో రోజుకు 800 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. లేదా ప్రతీ రెండు నిమిషాలకు ఒకరి చొప్పున మరణించారు.

Read Also: 114Year Old Teak Tree : బ్రిటీష్ వాళ్లు నాటిన చెట్టు.. దాని ధర తెలిస్తే షాకే

బెలారస్ దేశంలో ప్రసూతి మరణాల క్షీణత 98.5 శాతానికి తగ్గింది. వెనుజులాలో అత్యధిక పెరుగుదల నమోదు అయింది. 2000-2015 మధ్య అమెరికాలో అతిపెద్ద పెరుగుదల నమోదు అయింది. మొత్తం 8 యూఎన్ రీజియన్లలో కేవలం రెండింటిలో మాత్రమే మాతృమరణాలు తగ్గాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో 35 శాతం, మధ్య, దక్షిణాసియాలో 16 శాతం తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. యూరప్, ఉత్తర అమెరికాలో 17 శాతం, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల్లో 15 శాతం పెరిగినట్లు తెలిపింది. ప్రసూతి మరణాలు ఎక్కువగా పేద దేశాల్లో జరుగుతున్నాయి.

2020లో నమోదైన మరణాల్లో 70 శాతం సబ్ ఆఫ్రికాలోనే చోటు చేసుకున్నాయి. ఇక్కడ మరణాల రేటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో పోలిస్తే 136శాతం ఎక్కువగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, చాడ్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సోమాలియా, సౌత్ సూడాన్, సూడాన్, సిరియా మరియు యెమెన్ దేశాల్లో ప్రసూతి మరణాల రేటు ప్రపంచ సగటు కన్నా రెండు రెట్లు అధికంగా ఉంది.