NTV Telugu Site icon

Turkey Earthquake: కన్నీరు పెట్టిస్తున్న ఓ తండ్రి ఫోటో.. తీవ్ర భావోద్వేగానికి గురైన ఫోటోగ్రాఫర్

Turkey

Turkey

Turkey Earthquake: టర్కీ భూకంపంలో వెలుగులోకి వస్తున్న ఎన్నో ఫోటోలు ప్రపంచంతో కన్నీరు పెట్టిస్తున్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. సహాయచర్యల కోసం చూడకుండా తమ వారిని రక్షించుకునేందుకు ప్రజలు పడుతున్న తాపత్రేయం హృదయవిదారకంగా ఉన్నాయి. శిథిలాల కింద పుట్టిన శిశువు, పట్టగానే అనాథగా మారిన సంఘటనలు సిరియా దేశంలో వెలుగులోకి వచ్చింది.

Read Also: Bollywood: పఠాన్ జోరు కొనసాగుతుండగానే మరో షారుఖ్ సినిమా రిలీజ్…

ప్రస్తుతం ఓ ఫోటో కన్నీళ్లు పెట్టిస్తోంది. తన బిడ్డ కోసం ఓ తండ్రి పడుతున్న బాధ వర్ణణాతీతంగా ఉంది. టర్కీకి చెందిన మెసుట్ హాన్సర్, శిథిలాల కింద ఉన్న తన కూతురు చేయిని బయట నుంచి పట్టుకుని నేనున్నాను తల్లి అంటూ విలపిస్తున్నాడు. గడ్డకట్టించే చలిలో ఒంటరిగా కూర్చొని శిథిలాల మధ్య నుంచి బయటకు వచ్చిన కూతురు చేయిని పట్టుకుని అక్కడే ఉన్నాడు. తన కూతరు ఇర్మాన్ చనిపోయిందని తెలిసినా.. అక్కడ నుంచి వెళ్లేందుకు ఆ తండ్రికి మనసు రావడం లేదు. సోమవారం తెల్లవారుజామున వచ్చిన భూకంపంలో ఇర్మాన్ ఉంటున్న భవనం కుప్పకూలింది. దీంతో ఇర్మాన్ పై భవనం శిథిలాలు పడిపోయాయి. కేవలం ఆమె చేతి మాత్రమే బయట ఉంది. ఇది ఒక్క హాన్సర్ బాధే కాదు, తమ వారిని వెతుకుతూ ప్రమాదం నుంచి బయటపడిన వారు పిచ్చిగా శిథిలాల్లో వెతుకుతున్నారు.

ప్రముఖ ఫోటోగ్రాఫర్ అడెమ్ అల్టాన్, హాన్సర్ ఫోటోను తీస్తున్న సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు. హాన్సర్ తన బిడ్డ ఫోటోలను తీయాలని వణుకుతున్న స్వరంతో పిలిచారని.. ఆ సమయంలో నాకు మాటలు రాలేదని అల్టాన్ అన్నారు. ప్రపంచం తన, తన దేశం బాధను చూడాలని కోరుకున్నాడని తెలిపాడు. ఈ ఫోటో తీస్తున్న సమయంలో చాలా బాధగా అనిపించిందని, నేను ఏడుపు ఆపుకోలేకపోయాని అన్నారు.