NTV Telugu Site icon

Chile New Virus: చిలీలో కొత్త వైరస్… ఇబ్బందులు పడుతున్న జనం

Chile New Virus

Chile New Virus

Chile New Virus: ప్రపంచంలోని దేశాలను ఈ మధ్య కాలంలో కొత్త కొత్త వైరస్‌లో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్నటి కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడ గడలాడించింది. కరోనా వైరస్‌లో కూడా వేరు వేరు వేరియంట్లతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు చిలీలో కొత్త వైరస్‌ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. గిలాన్‌ బరే (జీబీఎస్‌) అని పిలిచే అరుదైన సిండ్రోమ్‌ ఒకటి దక్షిణ అమెరికా దేశం చిలీని నిలువునా వణికిస్తోంది. ఈ వింత వ్యాధి బారిన పడి జనం అల్లాడుతున్నారు. ఏం చేయాలో ప్రభుత్వానికే పాలుపోవడం లేదు. చివరికి దేశవ్యాప్తంగా ఏకంగా మూడు నెలల పాటు ఎమర్జెన్సీ విధించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది…

Read also: Supreme Court: ఆర్టికల్ 370 రద్దుపై పిటిషన్లు.. ఆగస్టు 2 నుంచి విచారణ

ఈ కొత్త వైరస్‌ మూలంగా ఒంట్లోని వ్యాధి నిరోధక శక్తి.. నరాల వ్యవస్థను శత్రువుగా భావించి దాడికి దిగే అత్యంత అరుదైన (ఆటో ఇమ్యూన్‌) సిండ్రోమ్‌ ఇది. నరాలపై దాడి మూలంగా ఒంట్లోని కండరాల వ్యవస్థ మొత్తాన్నీ పూర్తిగా నిర్విర్యం చేస్తుంది. దాంతో విపరీతమైన నిస్సత్తువ, అవయవాలు మొద్దుబారడం వంటి దుర్లక్షణాలు వేధిస్తాయి. ఇది సాధారణంగా కాళ్లలో మొదలై నెమ్మదిగా పైకి పాకుతూ ఒళ్లంతా ఆక్రమిస్తుంది. జీబీఎస్‌ బాగా ముదిరితే పక్షావాతానికి కూడా దారి తీస్తుందని జిన్‌ హువా వార్తా సంస్థ పేర్కొంది. పెద్దవాళ్లకు.. ముఖ్యంగా మగవాళ్లకు ఇది ఎక్కువగా సంక్రమిస్తుందని.. దీనితో అన్ని వయసులవారికీ రిస్కేనని తెలిపింది.

Read also: Arvind Swamy: 30 ఏళ్లకే స్టార్‌హీరో.. ప్రస్తుతం 3300 కోట్లకు యజమాని

జీబీ సిండ్రోమ్‌ ఎందుకు వస్తుందన్న దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. తరచూ ఇన్ఫెక్షన్లు.. ముఖ్యంగా కాంపిలోబాక్టర్‌ జెజునీ బ్యాక్టీరియా ఈ సిండ్రోమ్‌కు కారణంగా మారుతున్నట్టు మాత్రం తేలింది. అయితే ఇన్‌ఫ్లుయెంజా, సైటోమెగలూ, ఎప్‌స్టెయిన్‌ బర్‌తో పాటు కోవిడ్‌ వైరస్‌తో కూడా జీబీఎస్‌కు దారి తీసే ప్రమాదం పుష్కలంగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌ రోగ లక్షణాలు, నరాల పరీక్ష ద్వారా జీబీఎస్‌ ఉనికి బయట పడుతుంది. ముఖ్యంగా స్పైనల్‌ టాప్, ఎలక్ట్రోమియోగ్రఫీ వంటివి దీన్ని కచ్చితంగా పట్టిస్తాయి. జీబీఎస్‌ తాలూకు అత్యంత ప్రధాన లక్షణం విపరీతమైన నీరసమని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూరొలాజికల్‌ డిజార్డర్స్‌ అండ్‌ స్ట్రోక్‌ వెల్లడించింది. తొలి దశలో మెట్లెక్కుతుంటేనో, నడుస్తుంటేనో కూడా విపరీతమైన నీరసం రావడాన్ని దీని తొలి లక్షణంగా భావించవచ్చు. తర్వాతి దశలో శ్వాసప్రక్రియను నియంత్రించే కండరాలు బాగా బలహీనపడతాయి. ఎంతలా అంటే, మెషీన్‌ సాయంతో ఊపిరి తీసుకోవాల్సి కూడా రావల్సి వస్తుంది. ఈ లక్షణాలు తలెత్తిన రెండే రెండు వారాల్లో సమస్య బాగా ముదిరి రోగిని కదల్లేని స్థితికి చేరుస్తుంది. నరాలు బాగా దెబ్బ తింటాయి గనుక నరాల వ్యవస్థ నుంచి మెదడుకు అస్తవ్యస్త సంకేతాలు అందుతుంటాయి. దాంతో చర్మం లోపల పురుగులు పాకుతున్నట్టు చెప్పలేని బాధ కలుగుతుంటుంది. జీబీఎస్‌కు ఇప్పటికైతే ఇదమిద్దంగా చికిత్స అంటూ ఏమీ లేదు. సమస్య తీవ్రతను తగ్గించి, త్వరగా కోలుకునేందుకు సాయపడే మార్గాలు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్‌ బాధితులకు ప్రధానంగా వాడుతున్న చికిత్స ఇంట్రావీనస్‌ ఇమ్యునోగ్లోబులిన్‌ (ఐవీఐజీ). నరాలపై దాడికి దిగకుండా రోగ నిరోధక శక్తిని ఇది నియంత్రిస్తుందన్నమాట.

Show comments