Viral news: ఈ లోకంలో ఎలాంటి స్వార్ధం లేకుండా.. తిరిగి మన నుండి ఏది ఆశించకుండా మనకి ప్రేమని అందించే ఏకైక వ్యక్తి అమ్మ. అమ్మ ప్రేమకు హద్దు లేదు.. ఆ ఆప్యాయతకు అమృతం సాటి రాదు. అమ్మకి తన పిల్లలే ప్రపంచం. ఆ పిల్లల కోసం ఏదైనా చేస్తుంది. మరి అలాంటి అమ్మకి ఎవరైనా ప్రమాదం తలపెడితే ఆమె పిల్లలు చూస్తూ ఉంటారా..? అంటే ఉండరు.. తల్లికి ఏదైనా చిన్న ప్రమాదం తలపెట్టిన .. పిసిబడ్డ కూడా పిడికిలి బిగిస్తుంది అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. వివరాలలోకి వెళ్తే.. ఒక చిన్న పిల్లవాడు తన తల్లితో కలిసి జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటుతున్నాడు. అయితే ఆ సమయంలో ఒక కారు తన తల్లిని ఢీకొన్నది. దీనితో ఆమె అక్కడ పడిపోయింది. తన కళ్ళ ముందే తన తల్లిని కారుతో ఢీ కొట్టినందుకు ఆ పిల్లవాడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
Read also:Plane crash : ప్రమాదానికి గురైన విమానం.. నలుగురు మృతి
కోపంగా వెళ్లి ఆ కారును తన్నాడు. అలానే ఆ కార్ లో నుండి కిందకి దిగుతున్న వ్యక్తిని కోపంగా చూసాడు. అతనికి వార్ణింగ్ కూడా ఇచ్చాడు. చివరికి కారుతో ఢీ కొట్టిన వ్యక్తి, అక్కడ ఉన్న స్థానికులు ఆమెని పైకి లేపి కార్లో ఎక్కించారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోని చూసిన వాలంతా ఆ పిల్లవాడి ధైర్యానాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోని మీరు ఒకసారి చూసేయండి.