Site icon NTV Telugu

The Sun: సూర్యుడిపై భారీ విస్పోటనం.. 2 లక్షల కిలోమీటర్ల పొడవైన సౌరజ్వాల

The Sun

The Sun

A huge explosion on the sun: సూర్యుడిపై ఇటీవల కాలంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా సౌర విస్పోటనాలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్(సీఎంఈ) వెలువడుతున్నాయి. మంగళవారం సూర్యుడిపై భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల సూర్యుడి ఉపరితలం నుంచి 2 లక్షల కిలోమీటర్ మేర సౌరజ్వాల ఎగిసిపడింది. పేలుడు నుంచి వెలువడిని సౌరజ్వాల భూమి వైపుగా రావచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

సూర్యుడిపై ఉన్న ఏఆర్3112 ప్రాంతంలో సన్ స్పాట్ పేలడానికి సిద్ధంగా ఉందని.. దీని వల్ల ‘ఎం’ క్లాస్ సౌరజ్వాల ఎగిసిపడేందుకు 65 శాతం అవకాశం ఉందని, ఎక్స్ క్లాస్ విస్పోటనం చెందడానికి 30 శాతం అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సూర్యుడు తన సౌరచక్రంలో గరిష్ట స్థాయికి చేరుకోవడంతో సూర్యుడి ఉపరితలం కల్లోలంగా మారుతోంది. దీంతో సౌరజ్వాలలు, సన్ స్పాట్స్ ఏర్పడుతున్నాయి.

Read Also: kabul Blast: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ పేలుడు.. ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు

సూర్యుడి నుంచి ఎగిసిపడిన సౌరజ్వాలలు భూమిని నేరుగా తాకే అవకాశం ఉంది. ఇలా జరిగితే భూ వాతావరణంపై ప్రభావం ఏర్పడుతుంది. రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థ, పవర్ గ్రిడ్స్, నావిగేషన్ సిగ్నల్స్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే సూర్యుడి చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రం సూర్యుడి నుంచి వచ్చే సౌరజ్వాలలో ఉండే ఆవేశపూరిత కణాలను అడ్డుకుని జీవరాశిని రక్షిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున సూర్యుడి నుంచి విస్పోటనం చెందిన కోరోనల్ మాస్ ఎజెక్షన్స్(సీఎంఈ) భూ వాతావరణాన్ని చేరుకుంది. దీని ఫలితంగా భూమి ధృవాల వద్ద అరోరాలను ఏర్పరిచింది.

సూర్యుడు ప్రస్తుతం తన 11 ఏళ్ల సోలార్ సైకిల్ లో ఉన్నారు. దీంతో సూర్యుడి వాతావరణం క్రియాశీలకంగా మారింది. దీంతో సూర్యుడిపై సన్ స్పాట్స్, భారీ విస్పోటనాలు సంభవిస్తున్నాయి. సూర్యుడు ఈ 11 ఏళ్ల వ్యవధిలో తన అయస్కాంత ధృవాలను మార్చుకుంటాడు. దీని వల్ల సూర్యుడిపై వాతావరణంలో మార్పులు వస్తాయి. ఈ మ్యాగ్నిటిక్ ఫీల్డ్స్ మార్చుకున్న తర్వాత సూర్యుడి మళ్లీ యథాస్థితికి చేరుకుంటాడు.

Exit mobile version