Bette Nash: ఎనిమిది పదుల వయస్సులోనూ ఎయిర్‌హోస్టెస్‌గా.. ఈ బామ్మ అదుర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజుల్లో 50 ఏళ్లు దాటితేనే ఒళ్లు, కీళ్లు నొప్పులు అని కూర్చుంటారు. ఇక 60 ఏళ్లు దాటితే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ 86 ఏళ్లు వచ్చిన ఓ బామ్మ మాత్రం ఆ వయసులోనూ కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. మనమళ్లు, మనమరాళ్లతో టైమ్ పాస్ చేయాల్సిన టైంలో కూడా ఎయిర్‌హోస్టెస్ బాధ్యతలు అలుపు లేకుండా నిర్వర్తిస్తోంది. సాధారణంగా యువతులు, చిన్న వయసు మహిళలు నిర్వహించే పనిని ఎలా శ్రమ లేకుండా చేస్తూ ప్రయాణికులను అబ్బురపరుస్తోంది. ఏదో చిన్న సంస్థలో అనుకునేరు.. కాదండీ పేరు ప్రఖ్యాతలు గల ఎయిర్‌లైన్స్‌లో మరీ. అంతే కాదు ఆమె మాటతీరు చూసి అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు. అంతే కాకుండా అతిపెద్ద వయస్సు కలిగిన ఎయిర్ హోస్టెస్‌గా గిన్నిస్ రికార్డూ కొట్టేసింది. రిటైర్ అవ్వాల్సిన వయసులోనూ చలాకీగా పని చేస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటోంది అమెరికాకు చెందిన బెట్టె నాష్.
అమెరికాకు చెందిన బెట్టె నాష్ అనే పెద్దావిడ వయసు 86 ఏళ్లు. ఆమె 1957లో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా కెరీర్ ప్రారంభించారు. అలా ఈ ఏడాదితో కలిపి ఆమె 65 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకోనున్నారు. అమెరికాలో పైలట్లు 65ఏళ్లకే రిటైర్ అవుతారు.. కానీ కమర్షియల్ అటెండెంట్లకు సర్వీసు పరిమితి నిబంధన ఉండదు. దీంతో బెట్టె నాష్ 86 ఏళ్ల వయసులోనూ ఎయిర్ హోస్టెస్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇలా ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కురాలైన ఫ్లైట్ అటెండెంట్‌గా ఆమె గిన్నిస్ రికార్డ్ సైతం కొట్టేసింది.ఒకే సంస్థలో సుదీర్ఘ కాలం పనిచేసిన అత్యంత తక్కువ మందిలో బెట్టె నాష్ ఒకరు.
Also Read
- Zelenskyy: జెలెన్స్కీ విమానాన్ని డ్రోన్ ఢీకొట్టబోయిందా?.. నార్వే ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- Khawaja Asif: 'మధ్యవర్తి' నుంచి 'గారడీవాడి' స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
ఈ 86 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ ఎక్కువగా కొలంబియా – బాస్టన్ విమానంలో సేవలందిస్తుంటారు. కొలంబియా -బాస్టన్ విమానంలో తరచూ ప్రయాణించే వారికి నాష్ సుపరిచితమే. చిరాకు పడకుండా అందర్నీ చిరునవ్వుతో పలకరించడంతో ఆమెను అందరూ ఇష్టపడుతుంటారు. కాగా.. బెట్టె నాష్ తన కెరీర్‌లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికన్ ఎయిర్‌లైన్స్ జలఫిరంగుల సెల్యూట్‌తో సత్కరించింది. సాధారణంగా రిటైర్ అవుతున్న అధికారులకు ఇలాంటి గౌరవం కల్పిస్తారు. ఈ ఏడాదికి ఆమె 65 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఆమెను మరోసారి సత్కరించాలని విమానయాన సంస్థ ఏర్పాట్లు చేస్తోందట. ఈ వయసులోనూ సేవలందిస్తూ శభాష్ అనిపించుకుంటోంది ఈ అమెరికన్ బామ్మ.
తాజావార్తలు
-
Tilak Varma: టీమిండియాలో ఆడుతున్నా సంతోషంగా లేను.. చిన్నప్పటి నుంచి నా టార్గెట్ అదే!
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Suriya : ఒకే ఏడాది 3 సినిమాలు.. సూర్య కొత్త రికార్డ్
-
Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీలో మరో ప్రత్యేకత.. ఎంఎస్ ధోనీ తర్వాత అదరగొడుతున్న ‘బేబీ బాస్’..
-
Mayawati’s Big Decision: మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌పై మాయావతి వేటు.. బీఎస్పీ నుంచి పూర్తిగా బహిష్కరణ
ట్రెండింగ్
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..