Site icon NTV Telugu

ఆ విమానంలో 640 మంది కాదు… అంత‌కు మించి…

తాలిబ‌న్లు ఆఫ్ఘ‌నిస్తాన్‌ను ఆక్ర‌మించుకున్నాక అక్క‌డ ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి.  అప్ప‌టి వ‌ర‌కు కాబూల్ న‌గ‌రంలో హ్యాపీగా తిరుగుతున్న యువ‌త ఒక్క‌సారిగా ఇళ్ల‌కు ప‌రిమితం అయ్యారు.  పెద్ద సంఖ్య‌లో ఆఫ్ఘ‌నిస్తానీయులు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.  కాబూల్ ఎయిర్‌పోర్టులో అమెరికా సీ 17 విమానం ద్వారా రికార్డ్ స్థాయిలో 640 మందిని త‌ర‌లించారు.  ఇది పాసింజ‌ర్ రైలు కాద‌ని, అమెరికా సీ 17 విమానం అని అమెరికా ఆర్మీ పేర్కొన్న‌ది.  అయితే, ఆ విమానంలో ప్ర‌యాణం చేసింది640 మంది కాద‌ని, 823 మంది ప్ర‌యాణం చేశార‌ని అమెరికా ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.  540 మంది పెద్ద‌వారు, 183 మంది చిన్నారులు ప్ర‌యాణం చేశార‌ని తెలిపారు.  ప్ర‌తిరోజు వంద‌లాది మందిని కాబూల్ నుంచి వివిధ దేశాల‌కు ప్ర‌జ‌లను త‌ర‌లిస్తున్నారు.  ప్ర‌స్తుతం కాబూల్ ఎయిర్‌పోర్ట్ బ‌య‌ట ప‌రిస్థితులు బాగాలేద‌ని, అమెరికా ఆర్మీ అధికారులు మ‌రోసారి ప్ర‌క‌ట‌న చేసేవ‌ర‌కు ప్ర‌జ‌లు ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని అమెరికా రాయ‌బార కార్యాల‌యం తెలియ‌జేసింది.  

Read: అక్క‌డ మ‌ళ్లీ విజృంభిస్తున్న క‌రోనా… అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌భుత్వం…

Exit mobile version