Lightning Strike: క్యూబాలోని మతాంజాస్ నగరంలోని చమురు నిల్వ కేంద్రంలో పిడుగు పడింది. ఈ పిడుగుపాటు వల్ల భారీగా మంటలు చెలరేగడంతో దాదాపు 80 మంది గాయపడ్డారు. మంటలార్పేందుకు వచ్చిన 17 మంది అగ్నిమాపక సిబ్బంది అదృశ్యమయ్యారు. దేశ ఇంధన, గనుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. శుక్రవారం రాత్రి ఉరుములతో కూడిన గాలివాన సమయంలో మతాంజస్ సూపర్‌ట్యాంకర్ బేస్‌లో చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఇంకా ప్రయత్నిస్తున్నారని సీబీఎస్ న్యూస్ నివేదించింది. చమురు రంగంలో అనుభవం ఉన్న అంతర్జాతీయ నిపుణుల నుంచి క్యూబా ప్రభుత్వం తర్వాత తెలిపింది.
పిడుగు ఓ ట్యాంక్‌పై పడడంపై మంటలు చెలరేగాయని.. అనంతరం మరో ట్యాంక్‌కు వ్యాపించాయని.. ఇలా భారీగా మంటలు చెలరేగాయని అధికారిక క్యూబన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఆ ప్రాంతంలో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు మిలిటరీ హెలికాప్టర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రాంతంలో దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు ట్యాంకులపై నీటిని చల్లుతూ తీవ్రంగా శ్రమిస్తున్నారని మతాంజస్‌లోని అగ్నిమాపక కార్యకలాపాల అధిపతి రాబర్టో డి లా టోర్రే వెల్లడించారు.
Uttar Pradesh: కక్కుర్తి పడి టాటూస్ వేయించుకున్నారు.. హెచ్ఐవీ కొని తెచ్చుకున్నారు.
గాయపడిన వారి సంఖ్య 77కి చేరుకుందని, 17 మంది తప్పిపోయారని తెలిసింది. ఆ ప్రాంతంలో మంటలార్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న 17 మంది అగ్నిమాపక సిబ్బంది తప్పిపోయినట్లు ఓ అధికారి వెల్లడించారు. గాయపడిన వారిలో ఏడుగురిని హవానాలోని కాలిక్స్టో గార్సియా ఆసుపత్రికి తరలించారు. క్యూబా ఇంధన కొరతతో సతమతమవుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరిస్థితి ఇంకా విషమిస్తుండడంతో విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలకు ఇంధనంగా ఉపయోగించే ఎనిమిది జెయింట్ ట్యాంక్‌లను కలిగి ఉన్న స్టోరేజీ ఫెసిలిటీలో ఎంత చమురు కాలిపోయింది అనే దానిపై తక్షణ సమాచారం లేదు. అధికారుల ప్రకారం.. అగ్నిప్రమాదానికి దగ్గరగా ఉన్న డుబ్రోక్ పరిసరాలను ఖాళీ చేయించారు. క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్-కానెల్ శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
