Khalkha Jetsun Dhampa Rinpoche: 8 ఏళ్ల పిల్లాడిని చూసి చైనా భయపడుతోంది. ఈ ఎనిమిదేళ్ల బాలుడు టిబెట్ ను చైనా నుంచి వేరు చేస్తాడా అనే కలవరం మొదలైంది. మార్చి 8న హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో ప్రముఖ బౌద్ధగురువు దలైలామా, ఎనిమిదేళ్ల బాలుడికి దీక్షను ఇచ్చారు. ముఖానికి మాస్క్ ధరించి ఉన్న ఈ పిల్లవాడి ఫోటో ప్రపంచం వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ ఫోటో ప్రస్తుతం చైనాకు నిద్ర లేకుండా చేసింది. దలైలామా దీక్షను ఇస్తూ ఆ పిల్లవాడిని ‘‘ఖల్ఖా జెట్సన్ దంపా రింపోచే’’ అవతారంగా భావిస్తున్నారు. టిబెటన్ బౌద్ధమతంలో మూడో అత్యున్నత స్థానాన్ని ఆ పిల్లవాడికి కట్టబెట్టారు.
టిబెట్ బౌద్ధమతంలో దలైలామా మొదటి స్థానంలో, పంచెన్ లామా రెండో స్థానంలో ఉండగా.. దంపా రింపోచే మూడో అత్యున్నత స్థానాన్ని పొందారు. రాబోయే రోజుల్లో టిబెల్ లో ఆయన ధర్మ గురవు కాబోతున్నాడనే వార్తలు చైనాను కలవరపరుస్తున్నాయి. దీంతో చైనా ఆ పిల్లవాడు ఎవరు..? వారి తల్లిదండ్రలు ఎవరు..? అని వెతకడం ప్రారంభించింది. మనకు ఉన్న సమాచారం ప్రకారం ఈ 8 ఏళ్ల పిల్లవాడు మంగోలియాకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. మంగోలియాకు చెందిన ఈ బాలుడు అమెరికా పౌరసత్వం కూడా ఉంది.
Read Also: MI vs RCB: టాపార్డర్ విఫలం.. 10 ఓవర్లలో ముంబై స్కోరు ఇది
చైనా టిబెట్ ను ఆక్రమించుకుంది కానీ.. అక్కడి ప్రజల్లో మాత్రం దలైలామానే గురువుగా భావిస్తున్నారు. దలైలామా ఉన్నంత కాలం చైనా టిబెట్ పై పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించలేకపోతోంది. టిబెట్ ప్రజలు చైనాలో ఎక్కడ ఉన్నా కూడా దలైలామానే గురువుగా భావిస్తున్నారు. అయితే చైనా దలైలామా తర్వాత తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని గురువుగా ఉంచాలని భావిస్తోంది. గతంలో దలైలామా టిబెట్ కు చెందిన ఓ పిల్లవాడిని పంచెన్ లామా 1995లో ప్రకటించారు. అయితే అతడిని చైనా ప్రభుత్వం కిడ్నాప్ చేసింది. అతడిని జైలు ఉంచారా..? చంపేశారా..? అనే సంగతి కూడా బయటి ప్రపంచానికి తెలియదు. ఆ స్థానంలో చైనా తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని పంచెన్ లామాగా ప్రకటించింది. అయితే ఈ పంచెన్ లామాను టిబెట్ ప్రజలు ఇప్పటికీ అంగీకరించడం లేదు.
తన తర్వాత వారసుడిగా ఉండేందుకు చైనా భూభాగానికి చెందిన వ్యక్తి కాకుండా మంగోలియాకు చెందిన పిల్లవాడిని దలైలామా ఎంపిక చేశారు. రాబోయే కాలంలో దలైలామా స్థానాన్ని అధిరోహించే అవకాశం ఈ పిల్లాడికి ఏర్పడింది. టిబెటన్ బౌద్ధమతం మంగోలియాలో కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ నిర్ణయం పట్ల మంగోలియా సంతోషం వ్యక్తం చేస్తుంది. మరోవైపు చైనాతో శతృత్వం ఏర్పడొచ్చని భయపడుతోంది.