Texas Gun shooting: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఓ అఘాంతకుడు 8 ఏళ్ల చిన్నారితో సహా ఐదుగురిని అత్యంత క్రూరంగా కాల్చిచంపాడు. ఈ ఘటన టెక్సాస్‌లోని క్లీవ్‌ల్యాండ్‌లో జరిగింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు శాన్ జాసింటో కౌంటీ షెరీఫ్ పోలీసులు శనివారం వెల్లడించారు. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు వేధింపులకు సంబంధించి ఓ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత, సదరు ప్రాంతానికి పోలీసులు వెళ్లి చూడటంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also: Chennai: చెన్నై ఎయిర్‌పోర్టులో పాముల కలకలం..
చనిపోయిన వ్యక్తుల్లో 8 ఏళ్ల చిన్నారితో పాటు ఇద్దరు స్త్రీలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఇంటి ముందు ద్వారం నుంచి బెడ్రూం వరకు బాధితులు మృతదేహాలు పడి ఉన్నాయి. చనిపోయిన వారంతా హోండూరస్ దేశానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన నుంచి ఇద్దరు పిల్లలు ప్రాణాలతో భయటపడ్డారు. ఇద్దరు పిల్లల్ని రక్షించేందుకు ఇద్దరు స్త్రీలు వారిపై పడుకున్నట్టుగా అక్కడ పరిస్థితిని చూస్తే తెలుస్తోంది. దీంతో పిల్లలిద్దరు బుల్లెట్ గాయాల నుంచి రక్షించబడ్డారని పోలీసులు వెల్లడించారు.
బాధితుల తల, మెడ భాగంలో బుల్లెట్ గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో 10 ఉన్నారని పోలసులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి మెక్సికోకు చెందిన వ్యక్తిగా, దాడి సమయంలో అతను తాగి ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు, అతడిని పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే బాధితులతో, నిందితుడికి ఎలాంటి సంబంధం ఉందనే విషయంపై పోలీసులు ఎంక్వైరీ చేశారు.