Pakistan: వరుడికి 70, వధువుకు 22.. ముసలోడికి దసరా పండగ..

  • వైరల్ అవుతున్న పాకిస్తాన్ పెళ్లి..
  • వరుడికి 70, వధువుకు 22..
Pakistan Viral News

Pakistan Viral News

Pakistan: ముసలోడికి దసరా పండగ అంటే ఇదేనేమో. పాకిస్తాన్‌లోని రావల్పిండిలో జరిగిన ఒక పెళ్లి యావత్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. 70 ఏళ్ల వృద్ధుడు, 22 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 48 ఏళ్ల గ్యాప్ ఉంది. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. వరుడిని 70 ఏళ్ల హకీమ్ బాబర్‌గా గుర్తించారు. పెళ్లి తర్వాత వీరిద్దరు ఫోటో షూట్ కూడా చేసుకున్నారు. ఒక క్లిప్‌లో వధువు ‘‘ఏక్ థా టైగర్’’ మూవీలోని దిల్ దియాన్ గల్లన్ పాట పాడుతుండగా, వృద్ధ వరుడు కూడా పాడతటం ప్రారంభించాడు.

Read Also: Virat Kohli: సచిన్ vs విరాట్.. ఇద్దరిలో ఎవరు బెస్టో చెప్పేసిన కోహ్లీ!

ఈ వీడియో చూసిన వెంటనే సోషల్ మీడియాలో నెటిజన్లు మిక్స్డ్ రియాక్షన్స్ ఇచ్చారు. కొందరు ఈ జంట ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసించగా, మరికొందరు ఏంట్రా ఇది అని, ఇలా ఎలా ఫిగర్‌ను పట్టావ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ పెళ్లి ఇద్దరి ఇష్ట ప్రకారం జరిగిందని, వయస్సు ‘‘జస్ట్ నంబర్’’ అని హకీమ్ బాబర్ చెబుతున్నాడు. నిజమైన ప్రేమ ఉంటే ఆ బంధం ఎల్లప్పుడూ బలంగా ఉంటుందని చెబుతున్నాడు. తన భార్య విడాకులు తీసుకుందని, ఇస్లామిక్ సూత్రాలకు అనుగుణంగా పెళ్లి చేసుకున్నానని చెబుతున్నాడు. రావల్పిండిలో జరిగిన ఈ పెళ్లి యావత్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది.