NTV Telugu Site icon

German Christmas Market: జర్మనీలో క్రిస్మస్ మార్కెట్ దాడిలో ఏడుగురు భారతీయులకు గాయాలు..

German

German

German Christmas Market: జర్మనీలోని క్రిస్మస్ మార్కెట్‌లో జరిగిన దాడిపై భారత్‌ స్పందించింది. ముస్లీం వర్గానికి చెందిన దుండగుడు జనంపైకి కారు నడిపిన ఘటనలో తొమ్మిదేళ్ల చిన్నారి సహా మొత్తం ఐదుగురు చనిపోయారు. అలాగే, ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు గాయపడ్డారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొనింది. వారిలో ముగ్గురు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా.. మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. అయితే, గాయపడిన భారతీయులందరితో ఇండియన్ ఎంబసీ కార్యాలయం ప్రతినిధులు మాట్లాడారు.

Read Also: Sameer Rizvi Double Century: దేశవాళీ క్రికెట్‌లో సరికొత్త రికార్డు.. 13 ఫోర్లు, 20 సిక్సర్లతో ఊచకోత

అయితే, జర్మనీలోని మాగ్డేబర్గ్‌లోని క్రిస్మస్ మార్కెట్‌లో జరిగిన దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో ప్రాణ నష్టం వాటిల్లింది.. అధిక సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.. బాధితులకు తమ దేశం అండగా నిలుస్తోందని చెప్పుకొచ్చారు. గాయపడిన భారతీయులతో పాటు వారి కుటుంబాలతో మేం సంప్రదింపులు కొనసాగిస్తున్నామన్నారు. సాధ్యమైనంత వరకు వారికి సహాయ సహకారాల్ని అందిస్తామని భారత రాయబార కార్యాలయం ప్రతినిధులు చెప్పుకొచ్చారు.

Read Also: Pushpa – 2 : బాలీవుడ్ లో కొనసాగుతున్న పుష్పరాజ్ హవా

కాగా, క్రిస్మస్‌ పండుగ సమయంలో జర్మనీలో విషాద ఘటన నెలకొంది. మాగ్డెబర్గ్‌ నగరంలోని రద్దీగా ఉండే క్రిస్మస్‌ మార్కెట్‌లో 400 మీటర్ల దూరం వరకు వేగంగా సదరు ముస్లిం వ్యక్తి వెళ్లినట్లు సీసీఫుటేజీలో కనిపిస్తుంది. ఈ దారుణానికి పాల్పడిన తాలెబ్‌.ఎ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇక, గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Show comments