NTV Telugu Site icon

Earthquake: వనాటులో 7.1 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Earthquake

Earthquake

Earthquake: ఓషియానియా ప్రాంతంలో ఉన్న ద్వీప దేశం వనాటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఏకంగా 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. పసిఫిక్ సముద్రంలో ఉన్న ఈ చిన్న దేశం భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వనాలకు దక్షిణంగా గురువారం ఈ భూకంపం వచ్చిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రారంభంలో దీని తీవ్రత 7.3గా అనుకున్నప్పటికీ ఆ తర్వాత సవరించి 7.1గా వెల్లడించింది. భూమికి 48 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది.

Read Also: Denmark: బహిరంగంగా ఖురాన్ తగలబెట్టడాన్ని నిషేధిస్తూ పార్లమెంట్‌లో బిల్లుకి ఆమోదం..

ఇసాంగెల్ పట్టణానికి దక్షిణంగా 123 కిలోమీటర్ల దూరంలో, రాజధాని పోర్ట్ విలాకు 338 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉంది. భారీ భూకంపం రావడంతో పసిఫిక్ సముద్రంలో సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ఈ భూకంపం వల్ల వనాలు, న్యూ కలెడోనియా తీరాల వెంబడి తీరాల వెంబడి ప్రమాదకరమైన అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే ప్రస్తుతం భూకంపం వల్ల కలిగిన నష్టం గురించి వివరాలు తెలియలేదు.

3,20,00 మంది జనాభా కలిగిన వనాలు దీవుల సముదాయంలో భూకంపాలు సర్వసాధారణం. ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రంలో ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఉంది. ఇదే ప్రాంతంలో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, జపాన్, టోంగా వంటి దేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఆగ్నేయాసియా నుంచి పసిఫిక్ బేసిన్ అంతటా టెక్టానిక్ ప్లేట్ల కదలికలు భూ అంతర్భాగంలో ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా అగ్నిపర్వతాలు కూడా ఎక్కువే. ఈ ప్రాంతంలో పసిఫిక సముద్రం లోపల అగ్నిపర్వతాలు ఎక్కువ. నవంబర్ నెలలో ఉత్తర వనాటులో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది, ఇది చిన్న పాటి సునామీ అలలను ప్రేరేపించింది.

Show comments