Site icon NTV Telugu

Uganda: ఉగాండాలో ఘోర రోడ్డుప్రమాదం.. 63 మంది మృతి

Uganda

Uganda

ఉగాండాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు-నాలుగు వాహనాలు ఒకేసారి ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 63 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఉత్తర ఉగాండాలోని ప్రధాన నగరమైన గులుకు వెళ్లే హైవేపై మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Modi-Trump: బలపడుతున్న భారత్-అమెరికా బంధం.. సుంకాలు తగ్గే అవకాశం

ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. వ్యతిరేక దశల్లో వాహనాలు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా పేర్కొన్నారు. బస్సు డ్రైవర్లు ఇతర వాహనాలను అధిగమించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. ఓవర్‌టేకింగ్ సమయంలో రెండు బస్సులు ఎదురెదురుగా రావడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్లుగా చెప్పారు.

మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఓవర్‌ టేకింగే కారణమని.. వాహనదారులు రోడ్లపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కోరారు.

ఇది కూడా చదవండి: INDIA Bloc: దీపావళి తర్వాత కూటమిలో జ్ఞానోదయం.. తేజస్వి యాదవ్‌కు చిగురిస్తున్న కొత్త ఆశలు!

Exit mobile version