NTV Telugu Site icon

France: మహ్మద్ ప్రవక్తని కించపరిచాడని ఫ్రెంచ్ టీచర్ శిరచ్ఛేదం.. దోషులుగా 6 టీనేజర్లు..

France

France

France: ఫ్రాన్స్‌తో పాటు బెల్జియం, ఇతర యూరోపియన్ దేశాల్లో ఇస్లాం రాడికలైజేషన్ పెరుగుతోంది. పలువురు ఆయా దేశాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే 2020లో ఫ్రెంచ్ ఉపాధ్యాయుడు శామ్యూల్ పాటీని తల నరికి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ కేసులో ఆరుగురు టీనేజర్లను ఫ్రెంచ్ కోర్టు శుక్రవారం దోషులుగా నిర్ధారించింది.

Read Also: RK Roja: తెలంగాణకు, ఆంధ్రాకు ఎటువంటి సంబంధం లేదు.. జగనన్నే వన్స్ మోర్‌..

శామ్యూల్స్ తన క్లాసులో భావప్రకటన స్వేచ్ఛపై క్లాస్ చెబుతూ.. మహ్మద్ ప్రవక్తకు సంబంధించి వ్యంగ్య చిత్రాలను చూపించాడని, ఇది కొంతమంది ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రులకు కోపం తెప్పించింది. దీనిని కొందరు దైవదూషణగా భావించారు. అయితే దోషులుగా ఉన్న ఆరుగురు టీనేజర్లలో ఒక బాలిక, వ్యంగ్య చిత్రాలను చూపించే ముందు శామ్యూల్స్ పాటీ ముస్లిం విద్యార్థులను క్లాస్ రూం నుంచి బయటకు వెళ్లాలని చెప్పినట్లు ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. అయితే ఈ రోజు బాలిక క్లాస్ రూపంలోనే లేదని కోర్టు గుర్తించింది. తప్పుడు ఆరోపణలు, దూషణాత్మక వ్యాఖ్యలు చేసినందుకు కోర్టు ఆమెను కూడా దోషిగా నిర్ధారించింది.