Site icon NTV Telugu

Mexican Plane crash: కూలిన మెక్సికో నేవీ విమానం.. 2 ఏళ్ల చిన్నారి సహా ఐదుగురు మృతి

Mexican Plane Crash

Mexican Plane Crash

మెక్సికన్ నేవీకి చెందిన విమానం టెక్సాస్‌లోని గాల్వెస్టన్ బేలో కూలిపోయింది. సోమవారం మధ్యాహ్నం రోగులతో వెళ్తున్న విమానం హఠాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో రెండేళ్ల చిన్నారి సహా ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్ గార్డు అధికారులు తెలిపారు.

విమానంలో ఇద్దరు మిచా, మౌ ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు. ఈ సంస్థ మెక్సికన్ పిల్లలకు సహాయం అందిస్తుంది. ఎలాంటి లాభాపేక్షలేని సంస్థగా పేర్కొంది. విమానంలో మొత్తం 8 మంది ఉన్నట్లు చెప్పారు. నలుగురు నావికా సిబ్బంది. నలుగురు పౌరులు ఉన్నట్లుగా పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3:17 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు సంస్థలు అన్వేషిస్తున్నాయి.

అయితే ఈ ప్రమాదానికి పొగమంచే కారణంగా తెలుస్తోంది. కానీ ఈ విషయాన్ని అధికారులు స్పష్టంగా పేర్కొనలేదు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతం దట్టమైన పొగమంచుతో నిండిపోయి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాతావరణం అనుకూలించక కూలిపోయి ఉంటుందని సమాచారం.

 

Exit mobile version