Site icon NTV Telugu

Mali: మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్.. ఐసిస్ గ్రూప్‌పై అనుమానాలు

5indianskidnapped I

5indianskidnapped I

పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ కలకలం రేపుతోంది. కోబ్రీ సమీపంలో గురువారం ఐదుగురు భారతీయ కార్మికులను సాయుధ వ్యక్తులు కిడ్నాప్ చేశారని భద్రతా వర్గాలు తెలిపాయి. కార్మికులు విద్యుత్ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నట్లు వెల్లడించాయి. ఇక కిడ్నాప్ వార్తలను కంపెనీ కూడా ధృవీకరించింది.

ఇది కూాడా చదవండి: Trump: అమెరికా నిరసన.. దక్షిణాఫ్రికా జీ 20 సదస్సుకు ట్రంప్ గైర్హాజరు

అయితే గత కొంత కాలంగా అల్‌ఖైదా, ఐసిస్ ఉగ్రవాదం కారణంగా అశాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులే అపహరించుకుని వెళ్లి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్మికుల కిడ్నాప్‌ వార్త కలకలం రేపడంతో కంపెనీలో పని చేస్తున్న మిగతా భారతీయ కార్మికులను రాజధాని బమాకోకు తరలించినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఇదిలా ఉంటే భారతీయుల కిడ్నాప్‌ను ఏ గ్రూప్ కూడా అధికారికంగా ప్రకటించలేదు.

ఇది కూాడా చదవండి: TDP vs Janasena: తుని కూటమిలో కొత్త పంచాయతీ.. జనసేన నేత సంచలన వ్యాఖ్యలు..

పశ్చిమ ఆఫ్రికా దేశంలో విదేశీయుల లక్ష్యంగా కిడ్నాప్‌లు జరగడం సర్వసాధారణంగా మారింది. 2012 నుంచి తిరుగుబాట్లతో దేశం సతమతమవుతోంది. సెప్టెంబర్‌లో కూడా ఇద్దరు విదేశీయులు కిడ్నాప్‌కు గురయ్యారు. 50 మిలియన్లు చెల్లించిన తర్వాత విడుదల అయ్యారు. ప్రస్తుతం మాలిలో అశాంతి, జిహాదీ కారణంగా అల్లకల్లోలంగా మారింది.

ఇది కూాడా చదవండి: Off The Record: వైసీపీ కమ్మ రాగాన్ని కొత్త శృతిలో పాడబోతోందా..? ఇంతకీ ఏం చేయబోతుంది పార్టీ..?

Exit mobile version